టెక్సాస్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా హైదరాబాదీ నందితా బెర్రీ | Hyderabad-born is Texas secretary of state | Sakshi
Sakshi News home page

టెక్సాస్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా హైదరాబాదీ నందితా బెర్రీ

Published Sat, Dec 21 2013 4:25 PM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM

టెక్సాస్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా హైదరాబాదీ నందితా బెర్రీ

టెక్సాస్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా హైదరాబాదీ నందితా బెర్రీ

టెక్సాస్:  భారత సంతతికి చెందిన న్యాయవాది నందితా వెంకటేశ్వరన్ బెర్రీ(45) అమెరికాలోని టెక్సాస్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఎంపికయ్యారు. భారత్ కు చెందిన తొలి మహిళగా టాప్ మూడో ఎక్స్ క్యూటివ్ గా నందితా ఈ పదవికి ఎంపికయ్యారు. ఆ దేశ గవర్నర్ రిక్ పెర్రీ ఆమెను ఈ పదవికి ఎంపిక చేశారు.  నందితా కష్టపడే తత్వం కలిగి, అంకితాభావంతో పనిచేసేవారని గవర్నర్ రిక్ పెర్రీ  ఈ సందర్భంగా ఆమెను కొనియాడారు. హ్యూస్టన్ లో న్యాయవాది వృత్తిలో నైపుణ్యం సాధించిన నందితా 109వ టెక్సాస్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా జనవరి 7నుంచి పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.

అంతేకాకుండా ఆమె టెక్సాస్ రాష్ట్రానికి ప్రధాన ఎన్నికల అధికారిగానూ, ప్రోటోకాల్ ప్రధాన అధికారిగానూ, మెక్సికో వ్యవహారలపై, అంతర్జాతీయ వ్యవహారాలపై పర్యవేక్షించనున్నారు. నందితా హ్యూస్టన్ జూ, సౌత్ ఏసియన్ చాంబర్ ఆఫ్ కాన్ఫరెన్స్, హ్యూస్టన్ ఏరియా ఉమెన్స్ సెంటర్, హ్యూస్టన్ కమ్యూనిటీ ఫ్యామిలీ సెంటర్ వంటి సంస్థలకు ఆమె సేవలు అందించారు. నందితా తన 21వ ఏటా హ్యూస్టన్ లో అడుగుపెట్టారు. 200 డాలర్ల సంపాదనతో లా డిగ్రీ పూర్తిచేసిన నందితా, హ్యూస్టన్ లో నైపుణ్యం కలిగిన న్యాయవాదులలో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు పొందారు.

1968లో హైదరాబాద్ లో జన్మించిన నందితా  వెంకటేశ్వరన్ బెర్రీ,  హ్యూస్టన్ కు చెందిన మిచెల్ బెర్రీని వివాహం చేసుకున్నారు. నందితా బెంగళూరులో ఎమ్ టీ. కార్మెల్ కాలేజీలో బీఏ చదివారు. ఆ తరువాత అమెరికా వచ్చిన బెర్రీ హ్యూస్టన్ లోని యూనివర్సిటీలో పోలిటీకల్ సైన్స్ లో మరో డిగ్రీ చేశారు. 1995లో హ్యూస్టన్ యూనివర్సిటీ లా సెంటర్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. అదే సంవత్సరంలో టెక్సాస్ బార్ కౌన్సిల్ చేరారు. ప్రస్తుతం నందితా బెర్రీ లా సంస్థ అయినా లోకె లార్డ్ ఎల్ఎల్పీలో సీనియర్ కౌన్సిలర్ గా ఉన్నారు.

Advertisement

పోల్

Advertisement