నెల్లూరు: నెల్లూరు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శనివారం మున్సిపల్ మంత్రి పి. నారాయణ జాతీయ జెండాను ఎగరవేస్తుండగా జెండాకు ఆధారంగా ఉన్న తాడు తెగిపోయింది. దీంతో జెండా ఎగరకుండానే కిందపడింది. తర్వాత అధికారులు ప్రత్నామ్యాయ ఏర్పాట్లు చేయగా మంత్రి జెండా ఆవిష్కరణ చేశారు.