
స్కూల్ ప్రిన్సిపాల్ గా మహిళా ఐపీఎస్
తాను దర్యాప్తు కేసులో జోక్యం చేసుకోవద్దని ఉన్నతాధికారితో వాదించి వార్తల్లో నిలిచి మహిళా ఐపీఎస్ అధికారి భారతి అరోరా ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించనున్నారు.
గుర్ గావ్: తాను దర్యాప్తు కేసులో జోక్యం చేసుకోవద్దని ఉన్నతాధికారితో వాదించి వార్తల్లో నిలిచి మహిళా ఐపీఎస్ అధికారి భారతి అరోరా ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించనున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉన్నతాధికారితో గొడవపడినందుకు ఆమెను హర్యానాలోని రాయ్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ గా ఆమెను బదిలీ చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ గా ఐపీఎస్ అధికారిని నియమించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
రాయ్ స్పోర్ట్స్ స్కూల్ కు ప్రిన్సిపాల్ గా హర్యానా కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిని నియమించాలని క్రీడలు, యువజన విభాగం కోరిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి మనోహర్ లాట్ ఖట్టర్ ఆమోదం మేరకు క్రీడల మంత్రి అనిల్ విజ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపాయి. గుర్ గావ్ పోలీసు కమిషనర్ నవదీప్ విర్క్ పై ఆరోపణలతో అక్టోబర్ లో అరోరా వార్తల్లోకి వచ్చారు. తాను దర్యాప్తు చేస్తున్న హైప్రొఫైల్ రేప్ కేసులో కమిషనర్ జోక్యం చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. దీంతో ఆమెపై బదిలీ వేటు వేశారు.