మెల్‌బోర్న్: నరమేథం అభియోగాలపై సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్న భారత సంతతి వైద్యుడు జయంత్ పటేల్(63) కేసులో ఆస్ట్రేలియా ప్రభుత్వం దాదాపు రూ.21.22 కోట్లు వెచ్చించింది. ఏడేళ్లపాటు కొనసాగిన ఈ కేసు విచారణలో జయంత్ పటేల్‌పై దాఖలైన క్రిమినల్, వైద్య వృత్తిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగాలను ఇటీవలే బ్రిస్బేన్ సుప్రీం, డిస్ట్రిక్ కోర్టుల్లో ఉపసంహరించారు. మరో కేసులో కొద్ది రోజుల్లో తీర్పు వెలువడనుంది. ఆస్ట్రేలియా మీడియా ఆయన్ను ‘మృత్యు వైద్యుడు’ అని అభివర్ణించింది.
జయంత్ పటేల్ కేసు విచారణ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టినట్లు క్వీన్స్‌లాండ్‌లోని ప్రాసిక్యూషన్ల డెరైక్టర్ కార్యాలయం వెల్లడించింది. జూలై 2006 నుంచి ఈ ఏడాది జూన్ 30 మధ్య కాలంలో ఈ మొత్తం వ్యయం చేసినట్లు తెలిపింది. హోటల్‌లో గదులకు రూ.31 లక్షలు, భోజనాలకు రూ.24 లక్షలు ఖర్చు చేశారు.