
అమెరికా అధ్యక్ష రేసులో జెబ్ బుష్
మియామీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి మరో బుష్ దిగారు. మాజీ అధ్యక్షుడు హెచ్‌డబ్ల్యూ బుష్ కుమారుడు, మరో మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ సోదరుడు జెబ్ బుష్ తాను రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు. జెబ్ గతంలో ఫ్లోరిడా గవర్నర్‌గా పనిచేశారు. సోమవారం మియామీలో జరిగిన ర్యాలీలో తన ప్రచారాన్ని జెబ్ ప్రారంభించారు. అమెరికాను శక్తిమంతం చేసేందుకు అందరూ కలసి పనిచేయాలన్నారు. అయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జెబ్ తీవ్ర పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో మాజీ మంత్రి హిల్లరీ దూసుకుపోతున్నారు. కుటుంబం పేరు జెబ్‌కు కొంత మేలును మరికొంత కీడును కలుగజేసే సూచనలు కనిపిస్తున్నాయి.