ఫొటో: సచిన్‌ కూతురితో జాన్వీ బాయ్‌ఫ్రెండ్‌! | Jhanvi rumoured boyfriend parties with Sachin's daughter Sara | Sakshi
Sakshi News home page

సచిన్‌ కూతురితో జాన్వీ బాయ్‌ఫ్రెండ్‌ పార్టీ!

Published Tue, Apr 11 2017 12:53 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

ఫొటో: సచిన్‌ కూతురితో జాన్వీ బాయ్‌ఫ్రెండ్‌!

ఫొటో: సచిన్‌ కూతురితో జాన్వీ బాయ్‌ఫ్రెండ్‌!

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో ఎంటరవ్వకముందే.. మీడియాలో డామినేట్‌ చేస్తోంది. ఆమె తొలిచిత్రం ఏమిటన్నదానిపై గానీ, ఆమె ప్రేమ కబుర్లు గురించి గానీ బాలీవుడ్‌ మీడియాలో రూమర్స్‌కు కొదువలేదు. ఇక ఇటీవల ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ముంబైలో వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలకు ప్రముఖ పారిశ్రామికవేత్త, జట్టు యజమాని అనిల్‌ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీతోపాటు క్రికెటర్లు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీకి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ కూడా వచ్చింది. దీంతో సహజంగానే ఆమె ప్రియుడిగా భావిస్తున్న శిఖర్‌ పహరియా కూడా వచ్చాడు. అయితే, పార్టీలో శిఖర్‌ జాన్వీ కపూర్‌తో కాకుండా సచిన్‌ టెండూల్కర్‌ కూతురు సరాతో ఫొటోలకు పోజ్‌ ఇస్తూ సరదాగా కనిపించాడు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

సచిన్‌ గారాల పట్టి సరా ఇటీవల తన అభిమాన నటుడు రణ్‌బీర్‌ సింగ్‌తో ఫొటో దిగిన సంగతి తెలిసిందే.  ఈ ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడమే కాదు.. ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుందన్న కథనాలకూ కారణమైంది. అయితే, సరా ఇప్పుడు బాగా చదువుకుంటున్నదని, ఆమె సినిమాల్లోకి రాదని సచిన్‌ క్లారిటీ ఇచ్చారు. ఇక శ్రీదేవి-బోనీ కపూర్‌ గారాలపట్టి జాన్వీ కపూర్‌ను త్వరలోనే దర్శకుడు కరణ్‌ జోహర్‌ బాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారు. మరాఠీ బ్లాక్‌ బస్టర్‌ ’సైరత్‌’ రీమేక్‌తో జాన్వీ బాలీవుడ్‌లో అడుగుపెట్టనుందని వినిపిస్తోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement