ధోనీ ఎవరు?: లక్ష్మీరాయ్‌ | Julie 2 actress Raai Laxmi comment ex-boyfriend MS Dhoni | Sakshi
Sakshi News home page

మాజీ ప్రియుడు ధోనీపై లక్ష్మీ రాయ్‌ ఘాటు వ్యాఖ్య!

Published Mon, Sep 18 2017 11:42 AM | Last Updated on Fri, Sep 22 2017 11:17 AM

Julie 2 actress Raai Laxmi comment ex-boyfriend MS Dhoni

సాక్షి, ముంబై: దక్షిణాది హాట్‌ భామ లక్ష్మీరాయ్‌ త్వరలోనే ఎరోటిక్‌ థ్రిల్లర్‌ 'జూలీ-2'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీతో ఆమె అనుబంధం దశాబ్దం కిందటే ముగిసిపోయినా.. ఇప్పటికీ ఆ కథనాలు మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

2008లో ఐపీఎల్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా ధోనీ ఉన్నప్పుడు.. ఆ జట్టు ప్రచారకర్తగా లక్ష్మీరాయ్‌ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం చిగురించి.. ప్రేమ మొగ్గ తొడిగిందని అంటారు. అప్పట్లో ఈ ఇద్దరూ డేటింగ్‌ చేసినట్టు కథనాలు హల్‌చల్‌ చేశాయి. అయితే, ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఎక్కువకాలం కొనసాగలేదు.

తాజాగా 'స్పోట్‌బోయే' వెబ్‌సైట్‌తో ముచ్చటించిన లక్ష్మీరాయ్‌ను ధోనీ గురించి అడుగగా.. 'ఎవరు అతను' అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ' దీనికి ఫుల్‌స్టాప్‌ పడాల్సిన అవసరముంది. ఇది చాలాకాలం కిందటి ముచ్చట. ఇప్పుడు అతను ఆనందంగా పెళ్లి చేసుకున్నాడు. అతనికి పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని విషయాలు వర్కౌట్‌ కావు. వాటిని వదిలేసి ముందుకుసాగాల్సిందే' అని లక్ష్మీరాయ్‌ పేర్కొంది.

తమ అనుబంధం గురించి మీడియా అతిగా ఫోకస్ చేయడం.. దుష్ప్రభావం చూపిందని ఆమె పరోక్షంగా పేర్కొన్నారు. 'నేను అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రజలు వెంటనే కథనాలు అల్లేశారు. అది నిజం కాదు. అతిగా హైప్‌ క్రియేట్‌ చేయడం వల్ల మేం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాం. అందువల్లే నేను ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడలేదు. ఇప్పుడు కూడా కొంచెమే మాట్లాడుతున్నా. అతను అంటే గౌరవముంది. అందుకే ఆ వివరాల్లోకి వెళ్లడం లేదు' అని లక్ష్మీరాయ్‌ పేర్కొంది.

లక్ష్మీరాయ్‌ హాట్‌హాట్‌గా నటించిన 'జూలీ-2' సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ సినిమాకు కేంద్ర సెన్సార్‌ బోర్డు (సీబీఎఫ్‌సీ) మాజీ చైర్మన్‌ పహ్లాజ్‌ నిహలానీ డిస్ట్రిబ్యూటర్‌గా ఉండటం ఆసక్తి రేపుతోంది. అశ్లీలత పేరిట అర్థంపర్థం లేని కారణాలు చూపి సినిమాలకు కత్తెర వేసిన పహ్లాజ్‌.. ఓ శృంగారభరిత చిత్రానికి పంపిణీదారుడిగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోంది.

  • అతను అంటే గౌరవముంది
  • అందుకే ఆ వివరాల్లోకి వెళ్లడం లేదు
  • ఇప్పటికైనా ఈ ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement