దుబాయిలో కూళీ పనులు చేస్తూ కోనాయిపల్లి వాసి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి జరిగింది.
సిద్దిపేట(కరీంనగర్): దుబాయిలో కూళీ పనులు చేస్తూ కోనాయిపల్లి వాసి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కోనాయిపల్లి గ్రామానికి చెందిన మల్లమారి రాములు (50) దుబాయిలో 25 సంవత్సరాలుగా కూలీ పనులు చేస్తున్నాడు. రెండు సంవత్సరాల కిందట కూతురు వివాహం జరిపించి తిరిగి దుబాయి వెళ్లాడు.
అక్కడ పని చేస్తున్న క్రమంలో రాములుకు గుండెపోటు రావడంతో మృతి చెందాడని సమాచారం అందింది. తన భర్త మృతదేహన్ని ఇండియాకు తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మృతుని బార్య ఎల్లవ్వ వేడుకుంటొంది.