చిత్ర పరిశ్రమతో ‘మేక్ ఇన్ ఇండియా’ విస్తృతి
ముంబై: మన సంస్కృతిని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లగల భారతీయ చిత్ర పరిశ్రమ.. ‘మేక్ ఇన్ ఇండియా’ను విస్తృత పరిచేందుకు సరైన మాధ్యమమని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అభిప్రాయపడ్డారు. అసోచామ్ వెలువరించిన ‘డిజిటలైజేషన్ అండ్ మొబిలిటీ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే పుస్తకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న షారుఖ్ మాట్లాడుతూ, భారతీయ చిత్ర పరిశ్రమ మేక్ ఇన్ ఇండియాను విస్తృత పరచగలదన్నారు.