రాజ్యసభకు ‘డిస్కో డ్యాన్సర్’! | Mamata Banerjee nominates Mithun Chakraborty for Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు ‘డిస్కో డ్యాన్సర్’!

Published Sun, Jan 19 2014 4:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

Mamata Banerjee nominates Mithun Chakraborty for Rajya Sabha

కోల్‌కతా: ‘అయామె డిస్కో డ్యాన్సర్...’ అంటూ తన స్టెప్పులతో యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన నిన్నటితరం బాలీవుడ్, బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి ‘పెద్దల సభ’కు వెళ్లనున్నారు. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడైన మిథున్‌ను ఆ పార్టీ రాజ్యసభకు పంపనుంది. ఈ విషయాన్ని మమత శనివారం ప్రకటించారు. రాష్ట్రం నుంచి ఈసారి ఐదుగురు రాజ్యసభకు ఎన్నికవుతారని...వీరిలో ఒక సభ్యుడిగా మిథున్‌ను నామినేట్ చేయనున్నట్లు తన ‘ఫేస్‌బుక్’ ఖాతాలో సందేశం పోస్టు చేశారు. మిథున్ తన జీవితమంతా కళా రంగానికి, సామాజిక సేవకు అంకితం చేశారని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement