మనిషి-కంప్యూటర్ మేధలు కలిస్తే .... | Man-computer to check for problems | Sakshi
Sakshi News home page

మనిషి-కంప్యూటర్ మేధలు కలిస్తే ....

Published Sat, Jan 2 2016 2:43 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

మనిషి-కంప్యూటర్ మేధలు కలిస్తే .... - Sakshi

మనిషి-కంప్యూటర్ మేధలు కలిస్తే ....

న్యూయార్క్: మానవుని, కంప్యూటర్ మేధస్సులు కలిస్తే ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ ఘర్షణలు వంటి అనేక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశముందని ఓ అధ్యయనం పేర్కొంది. హ్యూమన్ కంప్యుటేషన్ ఇన్‌స్టిట్యూట్(హెచ్‌సీఐ), న్యూయార్క్‌లోని కార్నెల్ వర్సిటీలు రూపొందించిన విధానం.. పై సమస్యలకు వినూత్న పరిష్కారాలు చూపుతుందని పరిశోధకులు అంటున్నారు. మనిషి, కంప్యూటర్ మేధస్సుల మధ్య నిరంతరం పరస్పర సంప్రదింపులతో ఇది సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు.

ఈ విధానం ప్రకారం.. పెద్ద సంఖ్యలో మనుషులు సమన్వయ వ్యవస్థ ద్వారా అందించే(క్రౌడ్ సోర్సింగ్) సమాచారాన్ని కంప్యూటర్ ప్రాసెస్ చేస్తుంది. తర్వాత దాన్ని మరింత మెరుగుపరచడాకి, విశ్లేషించడానికి తర్వాతి వ్యక్తికి అందిస్తుంది. ఫలితంగా సరళమైన సమన్వయ వాతావరణం నెలకొని, సమస్యల పరిష్కారానికి అవకాశమేర్పడుతుంది. ఈ ఆలోచనను ఇప్పటికే గార్డెన్ నిర్వహణకు సంబంధించిన యార్డ్‌మ్యాప్.ఆర్గ్ వంటి పలు హ్యూమన్ కంప్యుటేషన్ ప్రాజెక్టుల్లో  అమలు చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement