నాకో చక్కటి అమ్మాయి కావాలి | Marilyn Manson wants to date a nice girl | Sakshi
Sakshi News home page

నాకో చక్కటి అమ్మాయి కావాలి

Published Mon, Sep 26 2016 9:43 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

నాకో చక్కటి అమ్మాయి కావాలి - Sakshi

నాకో చక్కటి అమ్మాయి కావాలి

లాస్ ఏంజెలెస్: అమెరికన్ సింగర్, రచయిత, మ్యుజిషియన్, నటుడు మారిలిన్ మాన్సన్కు డేట్ చేయడానికి ఓ చక్కటి అమ్మాయి కావాలట. తన వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని అర్థం చేసుకునే అమ్మాయి తోడు కోరుకుంటున్నానని మాన్సన్ చెప్పాడు.

అతని అసలు పేరు బ్రియన్ వార్నర్ కాగా మారిలిన్ మాన్సన్ పేరుతో సింగర్గా పాపులర్ అయ్యాడు. 47 ఏళ్ల మాన్సన్ వివాహానికి ముందు నటి రోజ్ మెక్గొవన్తో కొంతకాలం సన్నిహితంగా గడిపాడు. తర్వాత 2005లో డిటా వోన్ టీజెను వివాహం చేసుకున్నాడు. అయితే వీరి వివాహం బంధం ఎంతో కాలం సాగలేదు. రెండేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. నటి ఎవన్ రెచల్ ఉడ్తో మాన్సన్కు ఎఫైర్ ఉందని, అందుకే తాను విడిపోయానని టీజె చెప్పింది. ఎవన్తో అనుబంధం కొనసాగించిన మాన్సన్ ఆమెను వివాహం చేసుకోవాలని భావించినా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఓ ఫొటోగ్రాఫర్తో అతను ఎఫైర్ నడిపాడు. ప్రస్తుతానికి తాను సింగిల్గా ఉన్నానని డేట్ చేయడానికి చక్కటి అమ్మాయి కావాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాంటి అమ్మాయి దొరికితే ఆమె పేరు చెబుతానని అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement