యంగాన్(మయన్మార్): పొరుగు దేశాలైన చైనా, థాయిలాండ్, మలేసియాలకు అక్రమరవాణా చేసిన 219 మందిని గతనెలలో మయన్మార్ పోలీసులు రక్షించినట్టు అక్రమ రవాణా నియంత్రణ విభాగం ఆదివారం వెల్లడించింది. రక్షింపబడిన వారిలో 206 మంది నిర్బంధిత కార్మికులు, బలవంతపు పెళ్లి చేసి వ్యభిచారంలోకి నెట్టివేయబడిన 11 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే 8 నెలల కిత్రం 392 మంది అక్రమ రవాణా బాధితులను రక్షించినట్టు ఓ నివేదిక తెలిపింది. అక్రమ రవాణాకు పాల్పడిన 165 మందితోపాటు 78 మంది అనుమానితులను కూడా అరెస్ట్ చేసినట్టు గణాంకాల్లో వెల్లడైంది.
2006 నుంచి గతనెల ఆగస్టు వరకు జాతీయవ్యాప్తంగా మొత్తం 1,205 మంది అక్రమరవాణా కేసులు నమోదు అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా 2,394 మంది బాధితులను రక్షించి, 2,196 అక్రమరవాణాదారులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మహిళలు, కార్మికులు, చిన్నారుల అక్రమ రవాణాను అడ్డుకునే దిశగా ప్రస్తుత అక్రమరవాణా నియంత్రణ చట్టంలో మార్పులు చేసి, అందులోని లొసుగులను సవరణలు చేయనున్నట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.
219 అక్రమరవాణా బాధితులకు విముక్తి
Published Sun, Sep 6 2015 12:14 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM
Advertisement
Advertisement