‘జీపీఎఫ్‌ చెల్లింపుల్లో జాప్యం చేస్తే చర్యలు’ | Officers to face action for delay in GPF payments | Sakshi
Sakshi News home page

‘జీపీఎఫ్‌ చెల్లింపుల్లో జాప్యం చేస్తే చర్యలు’

Published Mon, Jan 30 2017 12:08 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

Officers to face action for delay in GPF payments

న్యూఢిల్లీ: పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సాధారణ భవిష్య నిధి (జీపీఎఫ్‌) చెల్లింపుల్లో జరిగే జాప్యానికి బాధ్యులయ్యే అధికారులపై చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పింది. జీపీఎఫ్‌ చెల్లింపుల్లో తరచుగా ఆలస్యం చోటుచేసుకుంటోంది.

దీని వల్ల ఆ కాలానికి ప్రభుత్వం అనవసరంగా వడ్డీ చెల్లించాల్సి వచ్చి అదనపు భారం పడుతోంది. దీనిని నివారించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఒక ఉత్తర్వు జారీ చేసింది.

Advertisement
Advertisement