
న్యూఢిల్లీ: కరోనా భయాల నేపథ్యంలో కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆధార్‌తో లింకై ఉన్న బయోమెట్రిక్ హాజరు వేయొద్దని తెలిపింది. దాని బదులు రిజిస్టర్‌లో హాజరు నమోదు చేసుకోవాలని సూచించింది. బమోమెట్రిక్ మెషీన్ వైరస్ వ్యాప్తికి వాహకంగా పనిచేస్తుందని సిబ్బంది శాఖ వెల్లడించింది. మెషీన్ ఉపరితలం ద్వారా వైరస్ కారక క్రిములు ఇతరులకు సోకే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అన్ని శాఖలూ తమ ఉద్యోగులు రిజిస్టర్‌లో మాత్రమే హాజరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు సిబ్బంది వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 31 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి.
(చదవండి: కరోనాపై సూచనలు, ఛలోక్తులు)
(చదవండి: భారత్‌లో 31వ కరోనా కేసు నమోదు)
Comments
Please login to add a commentAdd a comment