Biometric Attendance
-
నేటినుంచే డీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) గురువారం నుంచి మొదలు కానుంది. వచ్చే నెల 5 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. అయితే మధ్యలో 6 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 2,79,957 మంది దరఖాస్తు చేశారు. దర ఖాస్తు గడువు పొడిగించడంతో ఇటీవల టెట్ అర్హత పొందిన 48 వేల మంది కూడా వీరిలో ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పరీక్షకు 1.60 లక్షల మంది, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ (ఎస్జీటీ) పోస్టుల కోసం 80 వేల మంది దరఖాస్తు చేశారు. మిగతా వారిలో భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులున్నారు. తొలిసారిగా కంప్యూటర్ బేస్డ్ (ఆన్లైన్)గా జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా..ఒక్క గ్రేటర్ హైదరాబా ద్ పరిధిలోనే 27 కేంద్రాలున్నాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బయో మెట్రిక్ హాజరు: అభ్యర్థులకు బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి రోజూ రెండు షిఫ్టులుగా పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ ఒక విడత, సాయంత్రం 2 నుంచి 4.30 గంటల వరకు మరో విడత ఉంటుంది. జూలై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో పరీక్ష ఉండదు. ఎస్ఏ పరీక్షను జూలై 18, 20, 22, 24, 25, 30, 31, ఆగస్టు 1, 2 తేదీల్లో చేపడతారు. పీఈటీ పరీక్షను జూలై 18, 26 తేదీల్లో నిర్వహిస్తున్నారు. భాషా పండితులకు జూలై 26, ఆగస్టు 2, 5 తేదీల్లో డీఎస్సీ ఉంటుంది. పీఈటీలకు ఆగస్టు 5న, ఎస్జీటీలకు జూలై 19, 22, 23, 26, ఆగస్టు 1వ తేదీన పరీక్ష ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్‌కు జూలై 20న నిర్వహిస్తారు. ఆరేళ్ల తర్వాత..: ఉమ్మడి రాష్ట్రంలో 2012 ఆగస్టు 27, 28, 29 తేదీల్లో డీఎస్సీ నిర్వహించారు. చివరిసారిగా 2018 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు టీచర్స్ రిక్రూట్మెంట్ (టీఆర్టీ) పేరుతో జరిగింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ డీఎస్సీ జరుగుతోంది. దీంతో నిరుద్యోగులు ఈ పోస్టులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి 2023లో 5 వేల పోస్టులకు డీఎస్సీ నిర్వహించాలనుకున్నా వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. వివాదాల మధ్య..: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేస్తారని భావించినా కేవలం 11,062 పోస్టులకే డీఎస్సీ నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర్నుంచీ రకరకాల వివాదాలు చుట్టుముట్టాయి. ఖాళీలన్నీ డీఎస్సీలో చేర్చాలని నిరుద్యోగులు పట్టుబట్టారు. ఆ తర్వాత టెట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో డీఎస్సీ నిర్వహణకు మరికొంత సమయం ఇవ్వాలన్న డిమాండ్ తెరమీదకొచ్చింది. టెట్, డీఎస్సీ సిలబస్ వేరని, ఇప్పటికిప్పుడు పరీక్ష చేపడితే సన్నద్ధత కష్టమని కొత్తగా టెట్ ఉత్తీర్ణులైనవారు ఆందోళనకు దిగారు. కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. హాల్ టికెట్ల డౌన్లోడ్ సమయంలో కూడా డీఎస్సీ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ 20 శాతం మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోలేదు. వీరిలో కోర్టును ఆశ్రయించిన వాళ్ళు కూడా ఉన్నారు. న్యాయస్థానం చివరి నిమిషంలో తమకు అనుకూలంగా ఆదేశాలు ఇస్తుందనే ఆశతో వీరు ఉన్నారు. అయితే డీఎస్సీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం గురువారం నుంచి పరీక్ష నిర్వహణకు సిద్ధమైంది. -
ఈఎస్ఐ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో పనిచేసే ఉద్యోగులు విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాన ఆస్పత్రుల్లో ఇప్పటికే బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ మెషీన్లు నామమాత్రంగా పనిచేయడం... తరచూ మొరాయించడంతో పాత విధానాన్నే అనుసరిస్తున్నారు. తాజాగా ప్రతి ఆస్పత్రికి బయోమెట్రిక్ మెషీన్లు కొనుగోలు చేసి పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. గతవారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి బయోమెట్రిక్ హాజరుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రెండ్రోజుల క్రితం ఈఎస్ఐ డైరెక్టరేట్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. డిసెంబర్ నెలాఖరు కల్లా.... రాష్ట్రంలో ఈఎస్ఐ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు మరో మూడు ఆస్పత్రులు, 70 డిస్పెన్సరీలు ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఈఎస్ఐసీ నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని మిగతా 3 ఆస్పత్రులు, 70 డిస్పెన్సరీల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారులు చేసిన పత్రిపాదనలకు ప్రభుత్వ ఆమోదం రాగానే పది రోజుల్లో మెషీన్లు ఏర్పాటు చేయనున్నారు. మెషీన్ల నిర్వహణ కోసం తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్‌తో అవగాహన కుదుర్చుకోనున్నట్లు సమాచారం. అలసత్వం వహిస్తే వేతనం కట్... ఉద్యోగులకు ప్రతి నెలా హాజరు శాతానికి అనుగుణంగానే వేతనాలు ఇవ్వనున్నట్లు మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించిన వారిపైనా చర్యలు తీసుకుంటామని, ప్రతి ఆస్పత్రిలో ఫిర్యాదుల పెట్టెతో పాటు వాట్సాప్, సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు స్వీకరించేలా ప్రత్యేక విభాగాన్ని నిర్వహించాలని యోచిస్తున్నట్లు మంత్రి చెప్పారు. -
‘బయోమెట్రిక్’ అమలు చేయాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఆటలకు చెక్ పెట్టేలా హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) చర్యలకు ఉపక్రమించింది. కాలేజీలకు వర్సిటీ అనుబంధ గుర్తింపుప్రక్రియలో భాగంగా అధ్యాపకులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిస రి చేసిన వర్సిటీ.. దానిని అమలు చేయని కాలేజీలకు నోటీసులు జారీచేస్తోంది. అధ్యాపకులకు రోజువారీ బయోమెట్రిక్ అటెండెన్స్ ఎందుకు అమలు చేయడం లేదని ఆయా నోటీసుల్లో ప్రశ్నించింది. కనీస హాజరు శాతం కూడా ఉండడం లేదని పేర్కొంది. కాలేజీల తనిఖీల సమయంలో బయోమెట్రిక్ హాజరులేని బోధన సిబ్బందిని పరిగణనలోకి తీసుకోబోమని, వారిని ఫ్యాకల్టీగా భావించబోమని స్పష్టం చేసింది. ఈ విద్యాసంవత్సవరం నుంచి బయోమెట్రిక్ హాజరును పాటించకపోతే తదుపరి అనుబంధ గుర్తింపునకు అవకాశం ఉండబోదని తెలిపింది. దీనిపై ఈ నెల 8లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో యూనివర్సిటీ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తనిఖీల్లో గుర్తింపుతో.. 2022–2023 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు కోసం వర్సిటీ కమిటీలు కాలేజీల్లో గతనెల 18 నుంచి 22 వరకు తనిఖీలు నిర్వహించాయి. వర్సిటీ సర్వర్‌లో అధ్యాపకుల బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు కాని విషయాన్ని గమనించి నివేదిక సమర్పించాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ కళాశాలలకు నోటీసులు జారీ చేశారు. సగానికి పైగా కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత జేఎన్టీయూహెచ్ పరిధిలో సుమారు 143 కళాశాలలు ఉండగా సగానికి పైగా కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత వెంటాడుతోంది. మరోవైపు అధికారిక లెక్కల్లో ఫ్యాకల్టీ ఒకరు ఉంటే, వాస్తవంగా మరొకరు బోధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఫార్మసీ లాబ్ల్లో, మెడికల్ షాపుల్లో పనిచేసేవారితో పాటు, సాఫ్ట్వేర్æ కంపెనీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు (కాంట్రాక్ట్ పద్ధతిలో), ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో ఉన్నవారిని ఫ్యాకల్టీగా కళాశాలలు చూపించడం సర్వసాధారణమైంది. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దే దిశలో జేఎన్టీయూహెచ్ చర్యలకు దిగుతున్నట్టు తెలుస్తోంది. నాణ్యమైన విద్య అందుతుంది ఇంజనీరింగ్ కాలేజీల అధ్యాపకులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేసి, దానిని అమలు చేయని కాలేజీల కు నోటీసులు జారీ చేయడం హర్షణీయం. దీని వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. కొన్ని కాలేజీల్లో సిలికాన్ వేలిముద్రలు వినియోగిస్తున్నారు. దానిపైనా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి. – అయినేని సంతోష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, టీఎస్టీసీఈఏ -
‘బయోమెట్రిక్’ లెక్కనే జీతాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది హాజరుపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. వైద్యులు నిత్యం ఆస్పత్రులకు వచ్చేలా, సకాలంలో హాజరయ్యేలా చూడాలని.. జీతాలు ఇవ్వాలంటే బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బయోమెట్రిక్ హాజరు సరిగా లేని వైద్యులు, సిబ్బందికి నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు ఉన్నా.. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు వ్యవస్థలు ఉన్నప్పటికీ సరిగా అమలు చేయడం లేదు. వైద్యులు, సిబ్బంది కూడా బయోమెట్రిక్‌ను పట్టించుకోవడం లేదు. కొన్నిచోట్ల సదరు పరికరాలను పాడుచేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇక నుంచి ఏరియా, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లోనూ బయోమెట్రిక్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి, బయోమెట్రిక్ హాజరు ప్రకారమే జీతాలు ఇవ్వనుంది. ఎక్కడైనా వైద్య సిబ్బంది సకాలంలో హాజరుకాకున్నా, చెప్పాపెట్టకుండా గైర్హాజరైనా ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని కరీంనగర్, గజ్వేల్‌లలోని జిల్లా ఆస్పత్రుల్లో పలువురు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు సకాలంలో హాజరుకాకపోవడంతో కమిషనర్ అజయ్‌కుమార్ నోటీసులు జారీచేశారు. నల్లగొండ మెడికల్ కాలేజీలో 57 మంది అధ్యాపకులకు కూడా నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం నాయకులు అక్కడికి వెళ్లి పరిస్థితిని ఆరా తీశారు. కక్షగట్టి నోటీసులు ఇచ్చారని ఆందోళన చేయడంతో చివరికి నోటీసులను వెనక్కు తీసుకున్నారు. కొన్నిచోట్ల స్థానిక సూపరింటెండెంట్లు, కాలేజీల ప్రిన్సిపాల్లు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వైద్యులు ఆరోపిస్తుండటం గమనార్హం. ఆకస్మిక తనిఖీలు కూడా.. పేదలకు వైద్యాన్ని చేరువ చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల దాకా అన్నిచోట్లా మెరుగైన వసతులు కల్పిస్తూనే, వైద్యులు, సిబ్బంది సరిగా హాజరయ్యేలా చూడాలని నిర్ణయించింది. వైద్యులు సకాలంలో హాజరయ్యేలా చూడాలని సంబంధిత అధిపతులకు సూచించింది. ‘‘ఉన్నతాధికారులు వారంలో మూడు రోజులు జిల్లాలకు వెళ్లాలి. ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి. సకాలంలో హాజరుకాని వారిపైనా, అనధికారిక గైర్హాజరుపైనా చర్యలు తీసుకోవాలి. పరిస్థితిని చక్కదిద్దాలి’’ అని ఇటీవల వైద్యారోగ్యశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు జిల్లాలకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. రోగులతో మాట్లాడి ఆస్పత్రుల్లో సేవలను మెరుగుపరుస్తున్నారు. వచ్చిన రెండు నెలల్లోనే వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ 20 జిల్లాల్లో పర్యటించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉదయం 8 గంటలకే ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఇలా ఉన్నతాధికారుల తనిఖీలతో వైద్య సిబ్బందిలో భయం నెలకొందని అంటున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కూడా వరుసగా జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులపై సమీక్ష చేస్తున్నారు. మొత్తం అన్ని ఆస్పత్రులపైనా నెలవారీ సమీక్ష కేలండర్ చేపట్టి.. వైద్య సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్న వైద్యు లు, దూర ప్రాంతాల నుంచి వచ్చిపోయేవారు మాత్రం బయోమెట్రిక్ హాజరుపై ఆగ్రహంగా ఉన్నారని వైద్యారోగ్య సిబ్బంది చెప్తున్నారు. -
పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్లో కోత
సికింద్రాబాద్ జోన్‌లోని అయిదు సర్కిళ్లలో 3,228 మంది కార్మికులున్నారు. వీరిలో 1,683 మంది వేతనాల్లో కోత విధించారు. అంటే దాదాపు సగం మందికి జీతాల్లో కోత పడింది. కొన్ని సర్కిళ్లలో దాదాపు 70 శాతం మందికి వేతనాల్లో కోత విధించారు. కార్మికులకు రూ. 14వేల పైచిలుకు వేతనానికి రూ.1500 నుంచి రూ.8000 వరకు వేతనాల్లో కోత పడింది. నగరాన్ని పరిశుభ్రం చేసే 20వేల మందికి పైగా బల్దియా పారిశుద్ధ్య కార్మికుల కన్నీటి వెతలకు ఇది ఓ ఉదాహరణ. బయోమెట్రిక్ మెషిన్లలో సాంకేతిక లోపాలున్నా, సరిచేయాల్సిన కాంట్రాక్టు ఏజెన్సీ పనిచేయకున్నా దానిపై చర్యలు తీసుకోవడం మానిన అధికార యంత్రాంగం కార్మికుల కడుపు కొట్టింది. జీహెచ్ఎంసీలో దాదాపు నాలుగైదేళ్లుగా బయోమెట్రిక్ హాజరు నిర్వహిస్తున్నారు. మెషిన్లు పనిచేయని సందర్బాల్లో మాన్యువల్ హాజరు నమోదు చేసి వేతనాలిచ్చేవారు. మార్చి– ఏప్రిల్ నెలల్లో బయోమెట్రిక్ హాజరున్న రోజులకు మాత్రమే వేతనాలిచ్చారు. సమయంలో తేడా వచ్చినా కోత విధించారు. పారిశుద్ధ్య కార్మికుల సాధారణ పనివేళలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. వేసవి సందర్భంగా మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుందని దీన్ని ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు అమలుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విషయం కార్మికులకు ముందస్తుగా తెలియజేయలేదు. ఉదయం 5 నుంచి 6 గంటల లోపున హాజరైన వారికి హాజరు నమోదుచేయాల్సి ఉండగా, 5.30 గంటలు దాటితే వేయడం లేదని కొందరు కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్, యాకుత్‌పురా, గచ్చిబౌలి, వెంగళ్రావునగర్, అంబర్‌పేట సాంకేతిక సమస్యలు పరిష్కరించేదెవరు? బయోమెట్రిక్ హాజరు నమోదుకు వేల రూపాయల వ్యయమయ్యే మెషిన్లను కొనుగోలు చేయకుండా జీహెచ్ఎంసీ ప్రైవేటు ఏజెన్సీకి కాంట్రాక్టుకిచ్చి దానికి లక్షల రూపాయలు చెల్లిస్తోంది. సాంకేతిక లోపాలు తలెత్తినా, మెషిన్లు సక్రమంగా పనిచేయకున్నా ఏజెన్సీ బాధ్యత వహించాల్సి ఉండగా ఆ పనిచేయడం లేదు. కార్మికుల హాజరు నమోదు చేసే గ్రూప్‌లోని లీడర్(ఎస్ఎఫ్ఏ) సొంత జేబులోంచి ఖర్చు చేసుకోవాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు.బయోమెట్రిక్ మెషిన్లను సరిగ్గా వినియోగించడం రానందున కూడా ఆబ్సెంట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. వినియోగంపై తగిన అవగాహన కల్పించాల్సిన అధికారులు కాంట్రాక్టు ఏజెన్సీకిచ్చి చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిలాపాపం .. తలా పిడికెడు ► ఎస్ఎఫ్ఏలకు పైస్థాయిలోని వైద్యాధికారులు, ఇతరత్రా అధికారులకు నడుమ ఉండే అవినాభావ సంబంధాలు సైతం అక్రమాలకు దారి చూపుతున్నాయి. ఫంక్షన్లు చేసినప్పుడు టీలు, బిస్కెట్లు, పూలదండలు, శాలువాల నుంచి ఇతరత్రా వన్నీ తెమ్మని అధికారులు ఎస్ఎఫ్ఏలను పురమాయిస్తారు. వారి ఈ వైఖరి తెలిసిన ఎస్ఎఫ్ఏలు సైతం సమయానికి కార్మికులు రాకున్నా, అసలు రాకున్నా బయోమెట్రిక్ పనిచేయడం లేదని హాజరు నమోదు చేస్తారు. ఆ మేరకు కార్మికుల వేతనాల్లో వాటాలు పొందుతారు. ► దీన్ని ఆసరా చేసుకొని చాలామంది విధులకు రాకుండానే వేతనాలు పొందుతున్నారని తెలుస్తోంది. అలాంటి వారిలో ఎస్ఎఫ్ఏల కుటుంబసభ్యులు సైతం ఉంటారు. దీన్ని సక్రమంగా అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం అందరినీ ఒకేగాటన కట్టి ఇష్టానుసారం వేతనాల్లో కోత విధించడంపై కార్మికులు మండిపడుతున్నారు. వేతనాల్లో కోతలపై వివరణ కోసం సంబంధిత అడిషనల్ కమిషనర్‌కు ఫోన్ చేసినా స్పందన లేదు. పనిచేసిన వారికి వేతనాలివ్వాలని సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. సంబంధిత అడిషనల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. (క్లిక్: 111 జీవో ఎత్తివేతతో జరిగేది ఇదే?) బయోమెట్రిక్ ఓ చీటింగ్ బయోమెట్రిక్‌లో లోపాలున్నాయని అధికారులు అబద్ధాలు చెబుతున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు. అంతా చీటింగ్ నడుస్తుందని అనుమానంగా ఉంది. మూడు రోజులో, నాలుగు రోజులో మెషిన్ పని చేయకుంటే.. ఆలస్యమైతే అన్ని రోజులకు మాత్రమే వేతనాల్లో కోత విధించాలి. కానీ, వేలకు వేలు ఎలా? పూర్తిస్థాయిలో విచారణ జరిపి మా జీతం మొత్తం తిరిగి ఇచ్చేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – చెన్నమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు చర్యలు తీసుకుంటాం.. బయోమెట్రిక్ మెషిన్లలో లోపాల కారణంగా జీతాల్లో కోత పడింది. విధులకు హాజరైనప్పటికీ వేతనాలందని వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటాం. – కె.వి. శివప్రసాద్ మలక్‌పేట్ సర్కిల్ ఏఎంహెచ్ఓ -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..!
మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన గమనిక. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే, ఉద్యోగులందరూ తమ హాజరు రిజిస్టర్లను మాన్యువల్'గా నిర్వహించాల్సిన అవసరం ఉందని సిబ్బందికి మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. "గత కొన్ని రోజులుగా #COVID కేసులు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని, తదుపరి ఆదేశాల వచ్చే వరకు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని నిలిపివేశాం. ప్రధాని @NarendraModi నాయకత్వంలో, ప్రభుత్వ ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు" అని జితేంద్ర సింగ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అన్ని విభాగాల అధిపతులు కూడా ఉద్యోగులందరూ అన్ని వేళలా మాస్కులు ధరించేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత ఏడాది ఉద్యోగుల ఆరోగ్యాన్ని భద్రతను దృష్టిలో ఉంచుకొని బయోమెట్రిక్ విధానం నుంచి మినహాయింపు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే, మళ్లీ తిరిగి నవంబర్ 8 నుంచి కరోనా కారణంగా ఉద్యోగులకు అందించిన సౌకర్యాలన్నీ తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఉమేష్ కుమార్ భాటియా తెలిపారు. decision has been taken in the interest of safety and health of the govt employees. 2/2 #DoPT — Dr Jitendra Singh (@DrJitendraSingh) January 3, 2022 (చదవండి: గూగుల్ సెర్చ్‌లో ట్రెండ్ కరోనాదే.. టాప్ 10 జాబితా ఇదే!) -
క్షేత్రస్థాయి ఉద్యోగులకు బయోమెట్రిక్‌లో వెసులుబాటు
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయి విధులకు హాజరయ్యే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విషయంలో కొంత వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రొబేషనరీ సహా ఉద్యోగుల ఇతర సమస్యలపై చర్చించేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ బుధవారం పలు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించింది. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, డైరెక్టర్ షాన్‌మోహన్‌లతోపాటు ఆరు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అర్హులైన సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ ప్రకటన ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, వీలైనంత త్వరలో పూర్తవుతుందని అజయ్‌జైన్ తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో వెసులుబాటు సచివాలయాల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో విధులకు హాజరు కావాల్సి ఉంటుందని సంఘాల నేతలు ఈ సందర్భంగా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. బయోమెట్రిక్ హాజరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఏఎన్ఎంలతో పాటు ప్రత్యేకించి వ్యవసాయ అసిస్టెంట్, సర్వేయర్ తదితర క్షేత్రస్థాయి విధులలో పాల్గొనే ఉద్యోగులు సంబంధిత రోజుల్లో ఉదయమే కచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయాల్సిన అవసరం లేదని, అయితే అలాంటి రోజుల్లో ఆయా ఉద్యోగులు సాయంత్రం 3–5 గంటల మధ్య తప్పనిసరిగా హాజరై వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు బయోమెట్రిక్ వేసేలా వెసులుబాటు కల్పిస్తామని అజయ్ జైన్ ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏఎన్ఎం లాంటి ఉద్యోగులు సాయంత్రం పూట ప్రసూతి విధులకు హాజరైతే అన్‌డ్యూటీకి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. గ్రేడ్–5 గ్రామ కార్యదర్శులకు పూర్తి స్థాయిలో అధికారులు కల్పించే అంశంతో పాటు ఉద్యోగుల జాబ్ చార్టు రూపొందించని సెరికల్చర్ అసిస్టెంట్ తదితరులపై శాఖాధిపతులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని డిజిటల్ అసిస్టెంట్ కేటగిరి ఉద్యోగుల పేరును డిజిటల్ సెక్రటరీగా మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు భేటీ.. ప్రతి మూడు నెలలకొకసారి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్టు అజయ్‌జైన్ చెప్పారు. ప్రమోషన్ చానల్‌పై స్పష్టత కోరాం ఉద్యోగుల ప్రమోషన్ చానల్‌ను స్పష్టం చేయాలని సమావేశంలో కోరినట్లు గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అంజనరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని శాఖలకు ఇప్పటికీ సర్వీస్ రూల్స్ లేని విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చామన్నారు. సెరికల్చర్, ఏఎన్ఎం, మహిళా పోలీస్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించి సర్వీస్ రూల్స్ వెంటనే రూపొందించాలని కోరామన్నారు. కోవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగ అవకాశం క ల్పించాలని కోరామన్నారు. -
మళ్లీ బయోమెట్రిక్ బాట
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తిరిగి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. కోవిడ్–19 పరిస్థితుల నుంచి కోలుకున్న అనంతరం అక్టోబర్‌లో సంక్షేమ హాస్టళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ముందుగా పోస్టుమెట్రిక్ హాస్టళ్లను పూర్తిస్థాయిలో తెరిచిన సంక్షేమ శాఖలు.. క్రమంగా ప్రీమెట్రిక్ హాస్టళ్లను కూడా తెరిచాయి. విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ బోధన వినేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ.. 90 శాతానికిపైగా విద్యార్థులు ప్రత్యక్ష బోధనవైపే మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా పోస్టుమెట్రిక్ తరగతుల విద్యార్థులు రోజువారీగా కాలేజీల్లో ప్రత్యక్ష బోధనకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో సంక్షేమ వసతిగృహాలను పూర్తిగా అందుబాటులోకి తెచ్చిన అధికారులు.. వచ్చే నెల నుంచి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్.. సంక్షేమ వసతిగృహాల్లో బయోమెట్రిక్ హాజరు విధానం ఇదివరకే అమల్లో ఉంది. అయితే కోవిడ్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలు మూతబడడం, వాటిని తిరిగి ప్రారంభించినప్పటికీ ఎక్కువ కాలం తరగతులు కొనసాగకపోవడంతో సంక్షేమ హాస్టళ్లను తెరవలేదు. కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు గత నెల నుంచి గురుకుల విద్యా సంస్థలతో పాటు సంక్షేమ శాఖలకు సంబంధించిన కాలేజీ హాస్టళ్లను ప్రారంభించారు. అప్పటినుంచి విద్యార్థుల హాజరును మాన్యువల్ పద్ధతిలో తీసుకుంటున్నారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో తాజాగా బయోమెట్రిక్ హాజరును కొనసాగించాలని నిర్ణయించారు. ఈ విధానం అమలుతో హాజరు నమోదు పక్కాగా ఉంటుందని భావించి ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన హాస్టళ్లలో బయోమెట్రిక్ మిషన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటిని తిరిగి వినియోగంలోకి తేచ్చేందుకు చర్యలు చేపట్టిన అధికారులు.. టీఎస్టీఎస్ నుంచి సాంకేతిక సహకారాన్ని కోరారు. సాఫ్ట్వేర్ అప్డేషన్తో పాటు ట్రయల్స్ చేపట్టి పూర్తిస్థాయి అమలుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు. కొన్నిచోట్ల బయోమెట్రిక్ మెషీన్లు లేకపోవడంతో అక్కడ కొత్తగా కొనుగోలు చేసి వినియోగంలోకి తేనున్నారు. మొత్తంగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి విద్యార్థులంతా వేలిముద్రలతో కూడిన హాజరును ఇవ్వాల్సి ఉంటుంది. -
'బయోమెట్రిక్' ఆధారంగానే వేతనాలు
సాక్షి, అమరావతి: ‘ఏ ప్రభుత్వ, లేదా ప్రైవేట్ సంస్థ ఉద్యోగైనా సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకుండా జీతం ఇవ్వమంటే ఎవ్వరూ ఇవ్వరు. జీతం రావాలంటే సెలవు అయినా పెట్టాలి లేదా కార్యాలయానికైనా రావాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇదే అమలుచేస్తున్నారు. వారికి గతంలోనే బయోమెట్రిక్ హాజరుతో వేతనాలను అనుసంధానం చేశారు. అయితే, కోవిడ్ విపత్తు నేపథ్యంలో ఆ విధానానికి సడలింపు ఇచ్చారు. ఇప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బయోమెట్రిక్ హాజరును పునరుద్ధరించారు. అదే తరహాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ నుంచి పునరుద్ధరించారు. బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే అక్టోబర్ నెల వేతనాలిస్తాం’.. అని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ స్పష్టంచేశారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులతో పాటు శాఖాధిపతులు, కార్యదర్శులకు ఇదే విధానంలో హాజరును అమలుచేస్తున్నారని.. ప్రభుత్వోద్యోగుల తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు దీనిని అమలుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైతేనే వేతనాల్లో కోత పెడతారని.. ఇందులో తప్పేమీ లేదన్నారు. వారికి సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తాం కానీ.. విధులకు హాజరుకాకుండా సెలవు పెట్టకుండా వేతనాలివ్వాలంటే సాధ్యంకాదని జైన్ స్పష్టంచేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 మధ్య కాలంలో మొత్తం పనిదినాలు.. విధులకు హాజరైన రోజులు, ప్రభుత్వ సెలవులు పరిగణనలోకి తీసుకున్న తరువాత సిబ్బంది విధులకు గైర్హాజరైతేనే ఆ రోజులకు వేతనాల్లో కోత విధించాలని ఆయన ఆదేశించారు. మరోవైపు.. బయోమెట్రిక్ హాజరు ఆధారంగా అక్టోబర్ వేతనాలను నవంబర్ 1న చెల్లించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పష్టంచేసింది. హాజరు క్రమబద్ధీకరణకు వెసులుబాటు ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులందరికీ హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్, లాగిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. శిక్షణలో ఉన్నా, బయోమెట్రిక్ పనిచేయకపోయినా, విధుల్లో భాగంగా సమావేశాలకు వెళ్లినా, డిప్యుటేషన్‌పై ఇతర శాఖలకు వెళ్లినా హాజరు క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించారు. అలాగే, సిబ్బంది రోజువారీ హాజరును తనిఖీ చేసుకునేందుకు వీలుగా గ్రామ, వార్డు సచివాలయ వెబ్సైట్లో హాజరు డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తెచ్చారు. దీని ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు పాత పంచాయతీ కార్యదర్శులు, పాత వీఆర్వోలు, పాత మునిసిపల్ ఉద్యోగులకు వేతనాలను చెల్లించాల్సిందిగా డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశించింది. డ్యాష్‌బోర్డు హాజరులో సెలవులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ప్రస్తుతం హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్లో సీఎల్, ఐచ్ఛిక సెలవులే ఉన్నందున ఇతర సెలవులను కూడా పరిగణనలోకి తీసుకుని వేతనాలు చెల్లించాలని తెలిపింది. ఈ మార్గదర్శకాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వేతనాల బిల్లులను డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆధికారులు అప్లోడ్ చేసి ట్రెజరీలకు సమర్పించాల్సిందిగా అజయ్‌జైన్ ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో సజావుగా అమలయ్యేలా గ్రామ, వార్డు సచివాలయాల జేసీలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
విధులకు రాని వైద్యులకు నోటీసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో విధులకు రాని వైద్యుల విషయం చర్చనీయాంశంగా మారింది. వారంలో రెండు మూడు రోజులే వచ్చి మిగతా రోజులకు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నవారు ప్రతి ప్రభుత్వాస్పత్రిలో ఉన్నట్టు తేలింది. దీనిపై ఆరా తీస్తున్న కొద్దీ విస్మయపరిచే అంశాలు వెల్లడవుతున్నాయి. తాజాగా కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో 20 మంది వైద్యులకు నోటీసులు ఇచ్చారు. బయోమెట్రిక్ హాజరు లేకుండా రిజిస్టర్లో సంతకాలు చేసి విధులకు వచ్చినట్టు కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరిలో బయోకెమిస్ట్రీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ విభాగాల ప్రొఫెసర్లు కూడా ఉండటం గమనార్హం. విధులకు రాకుండా రిజిస్టర్లలో సంతకాలు సృష్టిస్తున్నవారు 48 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కర్నూలు కలెక్టర్ మెమో జారీ చేశారు. నెల్లూరు, విశాఖపట్నం, గుంటూరు, కడప తదితర కాలేజీల్లో బయోమెట్రిక్ వేయకుండా విధులకు వచ్చినట్టు చూపిస్తున్నవారి విషయం రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుల దృష్టికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాన్యువల్ (రిజిస్టర్) సంతకాలు కుదరవని, బయోమెట్రిక్ హాజరు ఉంటేనే వేతనం ఇవ్వాలని డీఎంఈ ఆదేశించారు. ఇప్పటికీ చాలా చోట్ల కొంతమంది వైద్యులు బయోమెట్రిక్ హాజరు కోసం నమోదు కూడా చేయించుకోలేదు. దీనిపై చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. చాలామంది వైద్యులు ఎలాంటి సమాచారమూ లేకుండా విధులకు గైర్హాజరవుతున్నారు. -
ఇంజనీరింగ్‌లో ఇక నిఖార్సైన బోధన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కాలేజీల్లో ఈ నెల 16 తర్వాత ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరును జేఎన్టీయూహెచ్ తప్పనిసరి చేయనుంది. అన్ని కాలేజీలతో అనుసంధానమవుతూ హాజరు పర్యవేక్షణకు ఇప్పటికే ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. దీనివల్ల సంబంధిత సబ్జెక్టులను అర్హులైన అధ్యాపకులే బోధించాల్సి రానుంది. దీంతో ఇప్పటివరకు చాలా కాలేజీలు అనర్హులతో చేపడుతున్న విద్యా బోధనకు తెరపడనుంది. అలాగే అధ్యాపకులకు కాలేజీలు నిర్దిష్ట సమయంలోనే వేతనాలు చెల్లించాల్సి రానుంది. నిజానికి బయోమెట్రిక్ అటెండెన్స్‌ను ఈ నెల ఒకటి నుంచే ప్రారంభిస్తామని జేఎన్టీయూహెచ్ గత నెలలోనే ప్రకటించింది. అయితే ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని భావించడంతో కొంత జాప్యమైనట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఏళ్ల తరబడి మోసం... జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 ఇంజనీరింగ్, 70 ఫార్మసీ, 10 మేనేజ్మెంట్ కాలేజీలు ఉండగా వాటిల్లో 30 వేల మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం అధ్యాపకుడు తప్పనిసరిగా ప్రొఫెసర్ అయి ఉండాలి. అలాగే ప్రిన్సిపాల్ విధిగా పీహెచ్డీ చేసి ఉండాలి. కానీ చాలా కాలేజీలు ఫ్యాకల్టీ విషయంలో విద్యార్థులను మోసం చేస్తున్నాయి. అర్హత లేని వారితో బోధన కొనసాగిస్తున్నాయి. దీనివల్ల విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఇంజనీరింగ్‌లో నాణ్యమైన విద్యను అందుకుంటున్న వాళ్లు 40 శాతం మందే ఉన్నారు. మిగతా విద్యార్థులు ఉపాధి కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా మంది బ్యాక్‌లాగ్స్‌తో నెట్టుకొస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికే బయోమెట్రిక్ తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నిబంధనల మేరకు బయోమెట్రిక్ అమలు చేస్తున్నా ఇందులో లొసుగులున్నాయని జేఎన్టీయూహెచ్ క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించింది. ఆధార్ లింక్ తప్పనిసరి ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి కానుండటంతో అధ్యాపకుడు ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ఇది జేఎన్టీయూహెచ్కు అనుసంధానమై ఉంటుంది కాబట్టి అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షించేందుకు అవకాశం లభించనుంది. అధికారులు బయోమెట్రిక్ నమోదు వివరాలను ఆయా కాలేజీల సమయాలతో సరిపోల్చుకొనేందుకు మార్గం ఏర్పడనుంది. అలాగే అధ్యాపకుల ఆధార్ నంబర్లను బయోమెట్రిక్ విధానానికి అనుసంధానించనుండటం వల్ల వారి వేతన వివరాలు తేలికగా తెలిసిపోతాయి. కాలేజీల నుంచి వేతనం అందుతోందా? వారు మరెక్కడైనా పనిచేస్తున్నారా? అనే వివరాలు తెలుస్తాయి. దీనివల్ల నకిలీ వ్యక్తులను రికార్డుల్లో చూపించడం కుదరదని అధికారులు అంటున్నారు. బయోమెట్రిక్‌తో ఉద్యోగాలు నిలబడతాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అధికారులు నిక్కచ్చిగా అమలు చేస్తే దాదాపు 30 వేల మంది అధ్యాపకులకు వేతనాలు సక్రమంగా అందుతాయి. దీనివల్ల ఇంజనీరింగ్‌లో నాణ్యమైన విద్య అందుతుంది. కాలేజీల మోసాలకు కళ్లెం పడుతుంది. – అయినేని సంతోష్‌కుమార్ (రాష్ట్ర స్కూల్స్, టెక్నికల్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు) విద్యార్థులకు మేలు బయోమెట్రిక్ హాజరుతో ఆధార్‌ను అనుసంధానిస్తే అర్హత ఉన్న అధ్యాపకుడే బోధన చేయడం అనివార్యమవుతుంది. ఇది విద్యార్థులకు మేలు చేస్తుంది. ఆధార్‌ను లింక్ చేయాలన్న లక్ష్యంతోనే ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది. – ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్, వీసీ -
కరోనా అలర్ట్: కేంద్ర సిబ్బంది శాఖ కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: కరోనా భయాల నేపథ్యంలో కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆధార్‌తో లింకై ఉన్న బయోమెట్రిక్ హాజరు వేయొద్దని తెలిపింది. దాని బదులు రిజిస్టర్లో హాజరు నమోదు చేసుకోవాలని సూచించింది. బమోమెట్రిక్ మెషీన్ వైరస్ వ్యాప్తికి వాహకంగా పనిచేస్తుందని సిబ్బంది శాఖ వెల్లడించింది. మెషీన్ ఉపరితలం ద్వారా వైరస్ కారక క్రిములు ఇతరులకు సోకే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అన్ని శాఖలూ తమ ఉద్యోగులు రిజిస్టర్లో మాత్రమే హాజరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు సిబ్బంది వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 31 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. (చదవండి: కరోనాపై సూచనలు, ఛలోక్తులు) (చదవండి: భారత్‌లో 31వ కరోనా కేసు నమోదు) -
వేలిముద్ర పడదే..!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులు, సిబ్బంది హాజరులో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొచి్చన బయోమెట్రిక్ హాజరు నమోదు విధానం క్షేత్రస్థాయిలో వసతిగృహ సంక్షేమాధికారులకు తలనొప్పిగా మారింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ పద్ధతిని వినియోగిస్తున్న నేపథ్యంలో హాజరుస్వీకరణ గందరగోళంగా మారింది. ముఖ్యంగా విద్యార్థుల వేలిముద్రలు నమోదు కావడం లేదు. దీంతో హాస్టల్లో ఉంటున్నప్పటికీ గైర్హాజరైనట్లే నమోదవుతోంది. ఈ పరిస్థితి హాస్టల్ డైట్ బిల్లుల రూపకల్పనలతో వసతిగృహ సంక్షేమాధికారులకు చిక్కులు తెచి్చపెడుతున్నాయి. ప్రతి విద్యా సంస్థలో బయోమెట్రిక్ హాజరువిధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వవిభాగాలు, క్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. సంక్షేమశాఖల పరిధిలోని వసతిగృహాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖతో పాటు బీసీ సంక్షేమశాఖ వసతిగృహాల్లో ఇప్పటికే బయోమెట్రిక్ హాజరువిధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తుండగా, ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని హాస్టళ్లలో ప్రస్తుతం ప్రయోగ పద్ధతిని కొనసాగిస్తున్నారు. అప్డేట్ కాకపోవడంతో... ఆధార్ వివరాలను ప్రతి కార్డుదారు ఐదేళ్లకోసారి అప్డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా వేలిముద్రల్లో వచ్చే మార్పులను అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. పిల్లల్లో వేలిముద్రలు మారడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కానీ చాలావరకు కార్డు తీసుకున్న సమయంలో తప్ప వివరాలను అప్డేట్ చేసుకోవడం లేదు. ప్రస్తుతం సంక్షేమ హాస్టళ్లలో ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ విధానానికి విద్యార్థుల వేలిముద్రలు సరిపోలకపోవడానికి ఇదే కారణం. ఆయా విద్యార్థులు తమ వేలిముద్రలు అప్డేట్ చేసుకుంటే తప్ప బయోమెట్రిక్ హాజరు నమోదుకు అవకాశం లేదు. హాస్టళ్లలో విద్యార్థులు వసతి పొందుతున్నప్పటికీ వారి హాజరు నమోదు కాకపోవడంతో వసతిగృహ సంక్షేమాధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టిన క్రమంలో విద్యార్థుల హాజరు ఆధారంగా డైట్ బిల్లులను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సగానికిపైగా విద్యార్థుల వేలిముద్రలు నమోదు కాకపోవడంతో వారు వసతిపొందుతున్నా, రికార్డుల ప్రకారం గైర్హాజరు చూపడంతో వారికి సంబంధించిన బిల్లులు విడుదల కావు. ప్రభుత్వం మాన్యువల్ పద్ధతి బిల్లులను అనుమతించకపోవడంతో వసతిగృహ సంక్షేమాధికారులు తలపట్టుకుంటున్నారు. -
‘సింథటిక్’తో సింపుల్‌గా దోచేశారు..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పారిశుధ్య కార్మికుల హాజరులో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు అవకతవకలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. కార్మికుల బయోమెట్రిక్ హాజరులో అక్రమాలు జరిగినట్లు తేలింది. నకిలీ (సింథటిక్) వేలిముద్రలు తయారు చేసి వాటితో పారిశుధ్య కార్మికులు హాజరు కాకపోయినా హాజరు వేసి వారి వేతనాలు కాజేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తనిఖీలు జరిపిన ఎన్ఫోర్స్మెంట్ విభాగం చాలా కాలంగా జరుగుతున్న గుట్టును రట్టు చేసింది. ఏకంగా 84 మంది నకిలీ వేలి ముద్రలను స్వాధీనం చేసుకున్నారు. 9 మందిపై వేటు.. క్రిమినల్ కేసులు.. జీహెచ్ఎంసీలో నకిలీ వేలిముద్రలతో పారిశుధ్య కార్మికుల హాజరు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగం బృందాలు దాదాపు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి హైదరాబాద్‌లోని 12 ప్రాంతాల్లో ఎస్‌ఎఫ్‌ఏలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. 84 కృత్రిమ (సింథటిక్) వేలిముద్రలు స్వాధీనం చేసుకున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం)డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. 17 మంది ఎస్ఎఫ్ఏలను తనిఖీ చేయగా, 9 మంది వద్ద ఈ నకిలీ ఫింగర్ ప్రింట్స్‌ను గుర్తించినట్లు తెలిపారు. 9 మంది ఎస్ఎఫ్ఏలను విధుల నుంచి తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. నకిలీ వేలిముద్రలతోపాటు 12 బయోమెట్రిక్ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. పది రూపాయల్లోపే తయారీ: కొవ్వొత్తిని కాల్చగా వచ్చిన ద్రవాన్ని అట్టముక్కపై వేస్తారు. కొద్దిగా ఆరిన ద్రవంపై వేలిముద్ర వేయిస్తారు. తర్వాత కొంచెం ఫెవికాల్ వేస్తారు. అది గట్టిపడ్డాక దిగువనున్న పేపర్‌ను తొలగిస్తే ఫింగర్‌ప్రింట్ మిగులుతుంది. దీనితో బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తున్నారు. నకిలీ వేలిముద్రల ద్వారా భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి తయారీకి రూ.5 నుంచి రూ.10 లోపే ఖర్చు కావడం గమనార్హం. బయోమెట్రిక్ హాజరును ఆధార్ అనుసంధానంతో పాటు జీపీఎస్‌నూ జత చేయడంతో అవకతవకలకు పాల్పడే వీలుండదని భావించిన అధికారులు.. తాజా ఉదంతంతో ఖంగు తిన్నారు. 2017 మేలో జీహెచ్ంఎసీ బయోమెట్రిక్ హాజరు ప్రారంభించింది. ఒక్క నెలలోనే రూ.2.86 కోట్లు మిగులు కనిపించింది. విధులకు గైర్హాజరైన వారిపేరిట జరిగిన స్వాహా అది. అలా ఏడాదికి రూ.35 కోట్ల మిగులు కనిపించింది. మే 21 నుంచి జూన్ 20 వరకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించారు. దీంతో ఒక్క నెలలోనే రూ.2,86,34,946 తేడా కనిపించింది. బయోమెట్రిక్ హాజరు లేనప్పుడు 2016 డిసెంబర్ 21 నుంచి 2017 జనవరి 20 వరకు రూ.34,64,22,282 వేతనాలుగా చెల్లించగా, బయోమెట్రిక్ హాజరు అమలు చేశాక 2017 మే 21 నుంచి జూన్ 20 వరకు రూ.31,77,87,336 మాత్రమే చెల్లించారు. అధికారులపై చర్యలు: మేయర్ పారిశుధ్య కార్మికుల బోగస్ హాజరు నమోదు చేస్తున్న 9 మంది ఎస్ఎఫ్ఏలను విధుల నుంచి తొలగించి వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా మేయర్ బొంతురామ్మోహన్ అధికారులను ఆదేశించారు. -
బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
ఎచ్చెర్ల క్యాంపస్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు, బోధన, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు పక్కాగా అమలు చేస్తామ ని బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాయం వైస్చాన్సల ర్ కూన రామ్‌జీ తెలిపారు. రిజిస్ట్రార్ కార్యాల యం సిబ్బందితో ఆయన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఆయన మట్లాడుతూ పూర్తిస్థాయి సాంకేతిక పరి జ్ఞానంతో కూడిన బయోమెట్రిక్ యంత్రాలు విని యోగిస్తామన్నారు. హాజరు, ముగింపు సమయం తప్పనిసరి అని తెలిపారు. లేనిపక్షంలో జీతంలో కొత తప్పదని స్పష్టం చేశారు. సపోర్టింగ్ స్టాఫ్ పక్కాగా పనిచేయాలని, పనిచేసిన రోజులకు సకాలంలో జీతాలు చెల్లించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. సిబ్బందికి ఉన్న పరిజ్ఞా నం ఆధారంగా ఏ,బీ,సీ గ్రేడులుగా విభజించి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామన్నారు. పాలన సక్రమంగా ముందుకు సాగేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని వివరిం చారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.రఘుబాబు, అసిస్టెంట్ రిజస్ట్రార్ రామారావు పాల్గొన్నారు. -
ఇది ‘బాబు’ భయోమెట్రిక్!
‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పదవ తరగతి విద్యార్థుల బయోమెట్రిక్ హాజరుపై సమీక్షిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మండల కేంద్రాల్లో ని హైస్కూళ్ల హెడ్మాస్టర్లు విధిగా టెన్త్ విద్యార్థుల హాజరును బయోమెట్రిక్‌లో తీసుకోవాలి’’– ఇదీ బుధవారం ఉదయం 10.30 గంటల కు జిల్లా విద్యాశాఖనుంచి హైస్కూ ళ్ల ప్రధానోపాధ్యాయులకు అందిన సంక్షిప్త సందేశం. అంతే! హెచ్ఎం లు బెంబేలెత్తారు. తరగతుల సంగ తి పక్కనబెట్టారు. టెన్త్ విద్యార్థుల హాజరును బయోమెట్రిక్‌లో తీసుకునేందుకు నానాపాట్లు పడ్డారు. యాదమరి: ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థుల హాజరు నమోదుకు బయోమెట్రిక్ మెషిన్లను ఇచ్చినప్పటికీ వివిధ కారణాలతో వాటిని అటకెక్కించారు. అప్ప ట్లో ఉపాధ్యాయులు విద్యార్థుల ఆధార్ కార్డు వివరాలతోపాటు నమోదు చేశా రు. సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ఇది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. వారు కూడా దీనిమీద ఫోకస్ పెట్టకపోవడంతో ఆ న మోదు కార్యక్రమం అలాగే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టెన్త్ విద్యార్థుల బయోమెట్రిక్ అటెం డెన్స్‌ను సమీక్షిస్తారని, దీని వివరాలు వెంటనే ఇవ్వాలని ఆదేశాలు రావడంతో జిల్లాలోని హెడ్మాస్టర్లు కంగుతిన్నారు. సమాచారం అందింది మొదలుకుని టెన్త్ విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు నమోదుకు ఆపసోపాలు పడ్డారు. నియోజకవర్గంలోని పూతలపట్టు, యాదమరి, తవణంపల్లె, ఐరాల, బంగారుపాళ్యం మండలాలలో 42 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో టెన్త్ చదువుతున్న బాలురు 1260, బాలికలు 1158, మొత్తం 2418మంది ఉన్నారు. పనిచేయని సర్వర్లు.. ప్రభుత్వ హైస్కూళ్లలో 6 నుంచి 10వ తరగతికి సంబంధించి ప్రతి తరగతికీ బయోమెట్రిక్ మెషిన్ ఇచ్చారు. పంపిణీ చేసిన సమయంలో సర్వర్ల సమస్య కారణంగా పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చేయలేకపోయారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే దీనిపై సమీక్షకు పూనుకున్నప్పటికీ సర్వర్లు పనిచేయకపోవడం గమనార్హం! దీంతో ఎక్కడ వేసిన బయోమెట్రిక్ అక్కడే అన్న చందాన మారింది. ఈ క్రమంలో టెన్త్ విద్యార్థుల హాజరు బయోమెట్రిక్‌లో ఎక్కడా నమోదు కాలేదని అధికారులు చెప్పడంతో ముఖ్య మంత్రి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో యుద్ధ ప్రాతిపదికన హెడ్మాస్టర్లు నమోదుకు పూనుకున్నారు. అక్రమాలు అరికట్టేందుకేనా? విద్యార్థులు తక్కువగా హాజరైనా ఎక్కువమంది హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేసి మధ్యాహ్న భోజన పథకం అమలులో అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు రావడంతో ప్రభుత్వం దీనికి చెక్ పెట్టే దిశగా విద్యార్థులకూ బయోమెట్రిక్ ట్యాగ్ తగిలించిందని తెలుస్తోంది. -
భూ సేకరణ తర్వాతే కొత్త లైన్లు
న్యూఢిల్లీ: కొత్త రైల్వే లైన్లు నిర్మించేందుకు అవసరమైన భూసేకరణ సంపూర్ణంగా జరిగిన తర్వాతనే పనులు ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. లేదంటే అవసరమైన భూమిని తప్పకుండా అప్పగిస్తామని కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు లిఖిత పూర్వక హామీనైనా ఇస్తేగానీ పనులు మొదలుపెట్టకూడదని రైల్వే నిశ్చయించింది. ప్రస్తుతం కొత్తలైనుకు అవసరమైన 70 శాతం భూమి లభ్యమవ్వగానే రైల్వే శాఖ లైను నిర్మాణం ప్రారంభిస్తోంది. దీనివల్ల కొన్నిసార్లు భూమి దొరకక పనుల్లో తీవ్ర జాప్యమై వ్యయం పెరిగిపోవడం లేదా పనులు పూర్తిగా నిలిచిపోవడం జరుగుతున్నందున తాజా నిర్ణయం తీసుకుంది. ఇకపై భూసేకరణ సంపూర్ణంగా జరిగేవరకు టెండర్లను పిలవకూడదని రైల్వే నిర్దేశించుకుంది. అయితే మొత్తం కొత్త రైల్వే లైనును కొన్ని భాగాలుగా విభజించి...ఏదేనీ నిర్దేశిత భాగంలో భూమి లభ్యంగా ఉన్నప్పడు పనిని ప్రారంభించవచ్చనీ, అందునా మొత్తం రైల్వే లైనుతో సంబంధం లేకుండా ప్రత్యేకించిన ఆ భాగం మాత్రమే పూర్తయినా రైల్వేకు లాభాలు వస్తాయనుకున్న సందర్భంలోనే ఇలా చేయాలని రైల్వే శాఖ జోనల్ జనరల్ మేనేజర్లను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నగరి, తమిళనాడులోని తిండివనం రైల్వే స్టేషన్ల మధ్య లైను (179.2 కిలో మీటర్లు) నిర్మాణంలో జరిగిన జాప్యాన్ని రైల్వే శాఖ ఈ సందర్భంగా ఉదహరించింది. ఆధార్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఆలస్యంగా విధులకు హాజరయ్యే ఉద్యోగులపై రైల్వే శాఖ కొరడా ఝళిపించనుంది. జనవరి 31 కల్లా దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, కార్యాలయాల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు నమోదు విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. జోనల్, డివిజనల్ కార్యాలయాలు, రైల్వే వర్క్‌షాప్‌లు, ఫ్యాక్టరీలు, ఉత్పత్తి యూనిట్లలో ఈ నెల చివరి నాటికే బయోమెట్రిక్ విధానం అమల్లోకి వస్తుంది. -
హాజరు ఒత్తిడి
తణుకు టౌన్: బయోమెట్రిక్ హాజరు పలు ప్రభుత్వ శాఖల్లోని క్షేత్ర స్థాయి ఉద్యోగులకు సంకటంగా మారింది. వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్ర స్థాయిలో పని చేసే ఏఎన్ఎంలకు ఈవిధానం అమలు చేయవద్దని ఆశాఖ కమిషనర్ ఆదేశించినా జిల్లా అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పని చేసే ఏఎన్ఎంలు, సూపర్వైజర్లుగా పనిచేసే మహిళా ఉద్యోగులకు ఇది తీవ్ర ఇబ్బందిగా మారింది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలోని సబ్ సెంటర్ల్లో పని చేసే వైద్య సిబ్బందిలో ఎక్కువ మంది ఫీల్డ్ వర్క్ చేసే వారే. వారిలో ఆరోగ్య కార్యకర్తలు, పురుష, మహిళా కార్యకర్తలు ఎక్కువగా వున్నారు. జిల్లాలో మొత్తం 81 పీహెచ్‌సీలు, వాటికి అనుబంధంగా 680 ఆరోగ్య ఉప కేంద్రాల్లో సుమారు 800 మంది ఏఎన్ఎంలు, 200 మంది సూపర్వైజర్లు పని చేస్తున్నారు. వీరంతా వారి పరిధిలోని పిల్లలు, బాలింతలు, గర్భిణిలకు వ్యాక్సిన్లు వేయటం, గర్భిణిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారి యోగ క్షేమాలను రికార్డు చేసి పీహెచ్సీ వైద్యాధికారికి నివేదించాలి. అయితే వీటిలో ఎక్కువ రిస్క్, అత్యవసర సేవలు అవసరమైన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలి. ఈ క్రమంలో గర్భిణిలను జిల్లాలోని వివిధ ఏరియా ఆసుపత్రులకుకానీ, ఏలూరు, కాకినాడలలోని జనరల్ ఆసుపత్రులకుగానీ కేసులను రిఫర్ చేసినప్పుడు సంబంధిత ఏఎన్ఎంలు బయోమెట్రిక్ హాజరే వేసుకోవాలా? రోగి కూడా వెళ్లాలా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్ హాజరు విధానం ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినా సర్వర్లు సరిగా పనిచేయక పోయినా, పంచాయతీ సిబ్బంది సరిగా స్పందించకపోయినా గంటల తరబడి బయోమెట్రిక్ యంత్రాల వద్ద పడిగాపులు కాయవలసి వస్తోందని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి పని చేసే గ్రామంలో మాత్రమే బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశించడం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకూ గ్రామంలో సర్వర్లు పని చేయకపోతే పక్క గ్రామంలో గానీ, పీహెచ్సీలోగానీ బయోమెట్రిక్ హాజరు వేసేవారు. ప్రస్తుత నిబంధనలతో వారి పరిస్థితి దినదిన గండంగా మారింది. రోగికి అత్యవసర వైద్యం కోసం బయటకు వెళ్తే ఆరోజుకు హాజరు లేనట్లేనని పేర్కొంటున్నారు. రెవెన్యూ సిబ్బందికి మినహాయింపు వీఆర్వో, సర్వేయర్, డిప్యూటి తహసీల్దార్, తహసిల్దార్‌కు బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపునిస్తూ వారం క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో పని చేసే వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు నిబంధనలు కఠినం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని మినహాయించాలి బయోమెట్రిక్ హాజరు నుంచి వైద్య ఆరోగ్య శాఖలోని క్షేత్ర స్థాయి ఉద్యోగులను ముఖ్యంగా ఏఎన్ఎం, సూపర్వైజర్లకు మినహాయింపు ఇవ్వాలి. ఇప్పటికే వారిపై అనేక పని భారాలు మోపారు. క్షేత్ర స్థాయిలో పని చేసే ఉద్యోగులు రోగులకు సేవలందించాలో, బయోమెట్రిక్ హాజరు కోసం వేచి చూడాలో తెలియక సతమతమవుతున్నారు. – కె.జయమణి, జిల్లా అధ్యక్షులు, వైద్య ఆరోగ్య శాఖ మహిళా ఉద్యోగుల సంఘం -
‘బయోమెట్రిక్’పై స్పష్టత కరువు
కళాశాలల్లో సాధారణ పద్ధతిలోనే అటెండెన్స్ సాక్షి, హైదరాబాద్: కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానంపై స్పష్టత కరువైంది. ఈ హాజరు ఆధారంగానే ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. విద్యార్థులతోపాటు బోధకుల హాజరులోనూ సమయపాలన, పారదర్శకత కోసం బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావాలని భావించింది. ఈ మేరకు బయోమెట్రిక్ మెషిన్లు కళాశాలల్లో అందుబాటులో పెట్టాలని యాజమాన్యాలకు సూచించింది. అయితే, స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సాధారణ పద్ధతిలోనే హాజరును స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తయింది. ఇంజనీరింగ్, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. మెషిన్ల కొనుగోలుకు వెనుకాడుతున్న యాజమాన్యాలు రాష్ట్రంలో 7,005 కాలేజీలున్నాయి. వీటిలో 2,750 ఇంటర్మీడియట్, వొకేషనల్, 4,245 డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, వృత్తి విద్యా కాలేజీలున్నాయి. వీటి పరిధిలో 16.50 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇంత పెద్ద సంఖ్యలోని విద్యార్థుల హాజరు నమోదు చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కనిష్టంగా 30 వేల మెషిన్లు అవసరమవుతాయని అంచనా. అయితే, మెషిన్లు కొనుగోలు చేసి నిర్వహించడం కష్టమని, వీటిని ప్రభుత్వమే సరఫరా చేయాలని కాలేజీ యాజమాన్య సంఘాలు కోరుతున్నాయి. కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తే దానికి విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఈపాస్ వెబ్‌సైట్‌ను అనుసంధానం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ భావించింది. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే అంశంపై సాంకేతిక విభాగంతో చర్చించింది. అయితే, బయోమెట్రిక్ విధానంపై స్పష్టత రాకపోవడంతో ఆ శాఖ సైతం నిర్ణయాన్ని మార్చుకుంది. ఎప్పటిలాగే విద్యార్థుల నుంచి ఒన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) పద్ధతిని పాటించాలని అంచనాకు వచ్చింది. -
బినామీలతో బోధిస్తే క్రిమినల్ కేసులు
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయండి త్వరలో టీచర్లకూ బయోమెట్రిక్ అటెండెన్స్ ఎంఈఓలు, హెచ్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వం కళ్లు కప్పి బినామీలతో పాఠ్యాంశాలను బోధింపజేస్తున్న ఉపాధ్యాయులను డిస్మిస్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులూ బనాయించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న 450 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కొందరు విధులకు వెళ్లకుండా బినామీలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. అందరికీ ఆదర్శఃగా ఉండాల్సిన గురువులే ఇలాంటి పనులు చేయడం తగదని హితవు పలికారు. ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎంలు ఎప్పటికప్పుడు పాఠశాలలను తనిఖీలు చేసి బినామీ టీచర్లను గుర్తించి ఓ నివేదికను డీఈఓకు పంపాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేపడతామని ఆ సమయంలో బినామీలు ఉన్నట్లుగా తేలితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పాఠశాల వేళలు కచ్చితంగా పాటించాలని, ఈ విషయమై త్వరలో అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకూ బయో మెట్రిక్ ద్వారా హాజరు గుర్తించే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థీ పదో తరగతి పాస్ కావడం ఎంతో కీలకమన్నారు. చిత్తశుద్ధితో పనిచేసి వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. సీ, డీ గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులను బెస్ట్ టీచర్స్, ఏ, బీ గ్రేడ్ విద్యార్థులను ఇతర ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో డీఈఓ శామ్యూల్, ఎస్ఎస్ఏ పీఓ దశరథరామయ్య, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
‘మా ఇష్టం’ ఇక చెల్లదు
- విధులకు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలే.. - ఉన్నతాధికారుల సీరియస్ - ‘సాక్షి’ కథనానికి స్పందన - హెచ్ఎండీఏలో త్వరలో బయోమెట్రిక్ అటెండెన్స్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో త్వరలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు సెక్రటరీ బాలాజీ రంజిత్ ప్రసాద్ తెలిపారు. కొందరు ఉద్యోగులు విధులకు ఆలస్యంగా వస్తున్న విషయాన్ని తేటతెల్లం చేస్తూ ‘సాక్షి’ మంగళవారం ప్రచురించిన కథనానికి ఆయన స్పందించి చర్యలకు ఉపక్రమించారు. ఉద్యోగులు విధుల్లోకి వచ్చేటప్పుడే కాదు... తిరిగి వెళ్లేటప్పుడు కూడా అటెండెన్స్ తీసుకొంటామన్నారు. ప్రస్తుతం గ్రీవెన్స్ సెల్లో ప్రత్యేకంగా రెండు రిజిస్టర్లు పెట్టామని, ఇన్‌టైంలో వచ్చినవారు ఒక రిజిస్టర్లో, ఆలస్యంగా వచ్చినవారు మరో రిజిస్టర్లో సంతకం పెట్టేలా జాగ్రత్తలు తీసుకొన్నామని తెలిపారు. నెలకు 3 రోజుల లేట్‌కు 1 సీఎల్ చొప్పున కట్ అవుతుందని, అదే 10.45 గం.ల తర్వాత విధులకు హాజ రైతే ఆఫ్ డే లీవ్ పెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు ఉదయం 10.30 గంటలకు, అటెండర్ స్థాయి సిబ్బంది ఉదయం 9.30 గంటలకే విధులకు హాజరు కావాలని , అటెండెన్స్ ఆధారంగానే సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. జవాబుదారీతనం కూడా ఉండాలి: సోమేశ్‌కుమార్ ఉద్యోగులు నిర్ణీత సమయానికి కార్యాలయానికి రావడమే కాదు.. పనిలోనూ జవాబుదారీ తనం అవసరమని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ అన్నా రు. గ్రేటర్ కార్యాలయాల్లో సిబ్బంది, ఉద్యోగులు విధులకు ఆలస్యంగా రావడంపై ఆయన స్పందిస్తూ జీహెచ్ఎంసీలోని ఉన్నతాధికారులు (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు) ఉద్యోగ వేళల్ని మించి పనిచేస్తున్నారని, ఆదివారాలు, సెలవులు లేకుండా పనిచేస్తున్నారన్నారు. మిగతా కార్యాలయ సిబ్బందిపై అజమాయిషీ లోపించడం నిజమేనన్నారు. వారు సక్రమంగా హాజరయ్యేందుకు మాత్రమే కాదు.. బాధ్యతాయుతంగా వ్యవహరించేం దుకు అందుబాటులోని సాంకేతిక విధానాల్ని అందుబాటులోకి తెస్తామన్నారు. బయోమెట్రిక్ హాజరుతోనే కాదు.. ఏపనిని ఎంత కాలంలో చేస్తున్నారనేది అంచనా వేసేందుకూ అవసరమైన చర్యలు చేపడతామన్నారు. కఠిన చర్యలు తీసుకోండి: డీఈఓలకు ఆర్జేడీ సుధాకర్ ఆదేశం ప్రభుత్వ పాఠశాలలకు సకాలంలో హాజ రుకాని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ప్రాంతంలోని డీఈఓలను రీజినల్ జాయింట్ డెరైక్టర్ సుధాకర్ ఆదేశించారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు విధులకు సకాలంలో హాజరుకాని తీరుపై ‘సాక్షి’ మంగళవారం ‘ప్రార్థనకు రాని సార్లు’ శీర్షికన కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనాన్ని చదివిన ఆర్జేడీ స్పందించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయుల పట్ల ఉపేక్షించకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రార్థన సమయంలో ఉండని హెచ్ఎంలు, టీచర్లకు ఉదయం పూట సీఎల్ (క్యాజువల్ లీవ్) అమలు కచ్చితంగా చేయాలని స్పష్టం చేశారు. -
ప్రభుత్వాస్పత్రిలో బయోమెట్రిక్
జనవరి రెండో వారం నుంచి అమలు ఆదేశాలు జారీచేసిన వైద్య విద్య సంచాలకులు వైద్యులు, సిబ్బంది ఆలస్యంగా రావడంపై మంత్రి కామినేని సీరియస్ లబ్బీపేట : ప్రభుత్వాస్పత్రిలో జనవరి రెండో వారం నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల నుంచి ఆస్పత్రి అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టం ఏర్పాటుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. మంత్రి కామినేని సీరియస్.. ప్రభుత్వాస్పత్రిలో వైద్యులతోపాటు నర్సింగ్, ఇతర సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సీరియస్‌గా ఉన్నారు. వారం రోజుల క్రితం ఆయన ఉదయం 10.15 గంటలకు పాత ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా, అప్పటికి 13 మంది వైద్యులు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయలేదు. వారిలో నగులురు వైద్యులు సెలవులో ఉన్నారు. మంత్రి ఆగ్రహం వ్యక్తంచేయడంతో మిగిలిని 9మంది వైద్యులకు ఆస్పత్రి అధికారులు మెమోలు జారీచేశారు. మూడేళ్ల క్రితమే ఏర్పాటుచేయాలని... ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు సమయపాలన పాటించడంలేదని చాలాకాలంగా విమర్శలు ఉన్నాయి. రోగులను అనుక్షణం పర్యవేక్షించాల్సిన షిఫ్ట్ డ్యూటీ చేసేవారు సైతం గంట ఆలస్యంగా రావడం, నిర్ణీత సమయం కన్నా ముందే వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో మూడేళ్ల క్రితమే బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని ప్రశేపెట్టాలని అప్పటి కలెక్టర్ రిజ్వీ భావించారు. ఆయన బదిలీ కావడంతో అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం మంత్రి జోక్యం చేసుకోవడంతో వెంటనే ఆదేశాలు జారీ అయ్యాయి. తద్వారా ఆలస్యంగా విధులకు హాజరయ్యేవారిని దారిలో పెట్టవచ్చని భావిస్తున్నారు. -
ఇక డుమ్మాలకు చెక్!
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దశలవారీ బయోమెట్రిక్ అటెండెన్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్ర సచివాలయంతో పాటు కొన్ని కార్యాలయాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నవంబరు ఒకటో తేది నుంచి నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దీనిని ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పని వేళల్లో ఉద్యోగులు విధిగా కార్యాలయాల్లో ఉండేట్లు చూడడమే దీని ఉద్దేశం. రాజధానిలో దీనిని ప్రవేశ పెట్టడం పూర్తయిన తర్వాత దశల వారీ జిల్లా, తాలూకా స్థాయి కార్యాలయాలకు కూడా దీనిని విస్తరిస్తారు. ఈ కొత్త అటెండెన్స్ వ్యవస్థను కల్పించుకోవడానికి ఆయా శాఖలే ఖర్చును భరించుకోవాలని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల కిందట సచివాలయంలో ఈ వ్యవస్థను ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఉద్యోగుల హాజరు శాతం గణనీయంగా మెరుగు పడింది. ఉద్యోగుల గైర్హాజరుపై ఫిర్యాదులు తగ్గాయి. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఉదయం ఆలస్యంగా రావడం, సాయంత్రం త్వరగా వెళ్లిపోవ డం సర్వ సాధారణం. కొందరు ఉద్యోగులు మరుసటి రోజు సెలవు తీసుకోవాలనుకుంటే, ముందు రోజే హాజరు పట్టీలో సంతకం చేసి వెళుతుంటారు. బయోమెట్రిక్ అటెండెన్స్ వల్ల ఇలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు.