సమీక్ష నిర్వహిస్తున్న వీసీ రామ్‌జీ
ఎచ్చెర్ల క్యాంపస్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు, బోధన, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు పక్కాగా అమలు చేస్తామ ని బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాయం వైస్‌చాన్సల ర్ కూన రామ్‌జీ తెలిపారు. రిజిస్ట్రార్ కార్యాల యం సిబ్బందితో ఆయన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఆయన మట్లాడుతూ పూర్తిస్థాయి సాంకేతిక పరి జ్ఞానంతో కూడిన బయోమెట్రిక్ యంత్రాలు విని యోగిస్తామన్నారు.
హాజరు, ముగింపు సమయం తప్పనిసరి అని తెలిపారు. లేనిపక్షంలో జీతంలో కొత తప్పదని స్పష్టం చేశారు. సపోర్టింగ్ స్టాఫ్ పక్కాగా పనిచేయాలని, పనిచేసిన రోజులకు సకాలంలో జీతాలు చెల్లించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. సిబ్బందికి ఉన్న పరిజ్ఞా నం ఆధారంగా ఏ,బీ,సీ గ్రేడులుగా విభజించి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామన్నారు. పాలన సక్రమంగా ముందుకు సాగేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని వివరిం చారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.రఘుబాబు, అసిస్టెంట్ రిజస్ట్రార్ రామారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment