
టీవీ చూస్తే చక్కెర వ్యాధి!
న్యూయార్క్: టీవీలో మీకు ఇష్టమైన కార్యక్రమాన్ని వీక్షించేందుకు కూర్చుకునే ముందు మరోసారి ఆలోచించుకోండి. ఎందుకంటే 'ఇడియట్ బాక్స్' ముందు గడిపే ప్రతిగంట మిమ్మల్ని డయాబెటిస్ కు దగ్గర చేస్తుంది. ప్రతిరోజు గంటపాటు టీవీ ముందు గడిపేవారు డయాబెటిస్ బారిప పడే అవకాశాలు ఎక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మిగతా వారితో పోల్చుకుంటే టీవీ ముందు ఎక్కువసేపు కూర్చునేవారికి మధుమేహం వచ్చే అవకాశాలు 3 శాతం అధికమని అమెరికా నేషనల్ ఇన్సిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ సహకారంతో డయాబెటిస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్(డీపీపీ) అధ్యయనంతో తేలింది.
మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోందని ఈ అధ్యయం రుజువుచేసిందని పిట్స్ బర్గ్ యూనివర్సిటీ సీనియర్ రచయిత ఆండ్రియా క్రిస్కా అన్నారు. కదలకుండా ఎక్కువసేపు కూర్చునే వారు అధికంగా రోగాల బారిన అవకాశముందని వివరించారు. శరీరక వ్యాయామంతో చలాకీగా ఉండడంతో పాటు చక్కెర వ్యాధి, ఊబకాయం రాకుండా చూసుకోవచ్చని సలహాయిచ్చారు.