ఫ్యామిలీ మొత్తం ఇరగదీశారు!
న్యూఢిల్లీ: గతంలో పెళ్లంటే బంధువుల సందడి, మేళతాళాలు, విందు భోజనాలు ఉండేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి వేడుకల్లో ఆబాలగోపాలం హుషారెత్తించే పాటలకు డాన్సులు చేయడం ఇప్పుడు సాధారణంగా మారింది. వధూవరులు కూడా అందరితో కలిసి నృత్యాలు చేయడం మామూలైంది. కొంతమంది అయితే డాన్సులు చేయడంతోనే సరిపెట్టడం లేదు. పెళ్లిసందడి అంతటిని వీడియో తీసి సోషల్ మీడియోలో పోస్ట్ చేసి వీక్షకులకు ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి వీడియోలకు ఆదరణ పెరుగుతుండటంతో సోషల్ మీడియాలో ఇప్పుడు వీటి సంఖ్య ఎగబాకుతోంది.
తాజాగా మాజిక్ మోషన్ మీడియా పోస్ట్ చేసిన పెళ్లి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. పెళ్లికూతురు దాలియా బెనడిక్ట్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు పాదం కలపడం ఈ డాన్స్ వీడియోలోని ప్రత్యేకత. ఒక టేక్‌లోనే ఈ వీడియో తీయడం మరో విశేషం. యూట్యూబ్‌లో ఇప్పటివరకు దీన్ని 3 లక్షల మంది వీక్షించారు. ఫేస్‌బుక్‌లో 9 లక్షల మంది చూశారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి డాన్స్ చేయడం బాగుందని, కెమెరా బాగా తీశారని నెటిజన్లు ప్రశంసించారు.