'మా టార్గెట్ వారే.. చంపి తీరుతాం'
కరాచీ: తమకు వ్యతిరేకంగా వార్తలు రాసిన ఏ జర్నలిస్టునైనా చంపేస్తామంటూ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ తాలిబన్ కమాండర్ కారి సైఫుల్లా సైఫ్ ప్రకటించాడు. ఇప్పటికే తమ హిట్ లిస్ట్లో చాలామంది ఉన్నారని, వారిని త్వరలోనే టార్గెట్ చేస్తామని తెలిపారు. బుధవారం జమాన్ మసూద్ అనే పాక్ హక్కుల కార్యకర్త, జర్నలిస్టు జమాన్ మసూద్ బైక్పై వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని సాయుధుడు వచ్చి కాల్పులు జరిపి హతమార్చాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే తాలిబన్ సంస్థ తమ బాధ్యతను ప్రకటించింది.
మసూద్ ను తామే హత్య చేశామని, అతడు పత్రికల్లో తమకు వ్యతిరేకంగా రచనలు చేయడం వల్లే హత్య చేశామని, అతడిలాగే ప్రస్తుతం చాలామంది జర్నలిస్టులు తమకు టార్గెట్గా ఉన్నారని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ హక్కుల సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఈ కేసు విషయంలో పాక్ ప్రభుత్వం శరవేగంగా స్పందించాలని పారదర్శకతతో కూడిన దర్యాప్తును జరపాలని అన్నారు. ఉగ్రవాదులు స్వయంగా తామే హత్యలు చేస్తున్నామని ప్రకటిస్తుంటే మీరేం చేస్తున్నారని పాక్ అధికారులను ప్రశ్నించారు.