!['జ్యుడీషియల్' కమిషన్ కు రాజ్యసభ ఆమోదం](/styles/webp/s3/article_images/2017/09/2/71400180928_625x300_5.jpg.webp?itok=iuf155IE)
'జ్యుడీషియల్' కమిషన్ కు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థ స్థానంలో జ్యుడీషియల్ నియామకాల కమిషన్ ఏర్పాటుకు వీలు కలిగించే చారిత్రాత్మక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 179 మంది సభ్యులు ఓటువేయగా, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ వ్యతిరేకించారు.
సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల ఎంపికకు ఆరుగురు సభ్యులతో జాతీయ స్థాయి కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు వీలు కలిగిస్తుంది. ఈ బిల్లుతోపాటుగా, కమిషన్ ఏర్పాటుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును కూడా సభ ఆమోదించింది. రాజ్యసభ ఆమోదంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించినట్టయింది. ఈ బిల్లుకు లోక్సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఇక నుంచి న్యాయమూర్తుల నియామకం జ్యుడీషియల్ నియామకాల కమిషన్ ద్వారా జరగనుంది.