
నబా జైలుపై దాడి; ఓ వ్యక్తి అరెస్ట్
చండీగఢ్: పంజాబ్‌లోని నబా జైలుపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో కారులో వెళ్తుండగా పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. జైలుపై దాడికి పాల్పడినవారికి నిందితుడు సహకరించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. జైలు నుంచి తప్పించుకున్నవారు నేపాల్‌కు పారిపోయే అవకాశముందని సమాచారం రావడంతో ఉత్తరప్రదేశ్‌లో హై ఎలర్ట్ ప్రకటించారు.
ఆదివారం నబా జైలుపై 10మంది సాయుధులు దాడి చేసి.. ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూతో పాటు మరో నలుగురిని విడిపించుకొని తీసుకెళ్లారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర‍్యలు చేపట్టారు.