కిరెన్‌ రిజిజుపై అవినీతి ఆరోపణలు! | Power Ministry says cleared bills before Kiren Rijiju's letter | Sakshi
Sakshi News home page

కిరెన్‌ రిజిజుపై అవినీతి ఆరోపణలు!

Published Wed, Dec 14 2016 3:36 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

కిరెన్‌ రిజిజుపై అవినీతి ఆరోపణలు!

కిరెన్‌ రిజిజుపై అవినీతి ఆరోపణలు!

న్యూఢిల్లీ: రూ. 450 కోట్ల స్కాంలో పాత్ర ఉందంటూ కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజుపై ఆరోపణలొచ్చాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న 600 మోగావాట్ల కమెంగ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టులోని రెండు డ్యామ్‌ల నిర్మాణానికి సంబంధించిన అవకతవకలపై.. నాటి నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌(నీప్కొ) ప్రధాన విజిలెన్స్‌ అధికారి సతీశ్‌ వర్మ(ఐపీఎస్‌) సీబీఐకి, సీవీసీకి, కేంద్ర విద్యుత్‌ శాఖకు నివేదిక పంపించారంటూ వార్తలు వెలుగులోకి రావడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఆ నివేదికలో కేంద్ర మంత్రి రిజిజు, ఆయన సోదరుడు వరసయ్యే  గొబొయ్‌ల పేర్లను సతీశ్‌ వర్మ ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. భారీగా నకిలీ రవాణా బిల్లులను చూపి రూ. 450 కోట్ల మేర ఖజానాకు నష్టం చేకూర్చినట్లు అందులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement