రాళ్లను చూస్తే నోరూరుతోంది... ఏంచేయను | Pregnant mum addicted to eating ROCKS says: 'I feel ashamed but I have to do it' | Sakshi
Sakshi News home page

రాళ్లను చూస్తే నోరూరుతోంది... ఏంచేయను

Published Sat, May 2 2015 9:31 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

రాళ్లను చూస్తే నోరూరుతోంది... ఏంచేయను

రాళ్లను చూస్తే నోరూరుతోంది... ఏంచేయను

మహిళ గర్భంతో ఉన్నప్పుడు ఎవరైనా ఏమి తింటారు. మంచి ఆహారం తీసుకుంటారు. ఆ విషయం అందరికి తెలిసిందే. ఎందుకంటే తల్లి పుట్టబోయే బిడ్డ ఇద్దరి ఆరోగ్యం క్షేమంగా ఉండాలని అంతేకదా. అయితే న్యూయార్క్లో కడుపుతో ఉన్న సిల్వియా అనే మహిళ  మాత్రం తన రూటే సపరేట్ అంటుంది. రాళ్లు తింటూ బతికేస్తుంది. రాళ్లు తినకూడదని వైద్యులు చెవుల్లో ఇల్లు కట్టి పోరినా... ఏమి చేయమంటారు డాక్టర్ గారు...  రాళ్లను చూస్తే నాకు నోరూరుతోందని....నోట్లో లాలాజలం ఉప్పొంగుకొస్తుందని మరీ చెబుతుంది.

దీంతో ఓరి దేవుడా ...సిల్వియాను మార్చలేమంటూ డాక్టర్లు చేతులెత్తేశారు. ఇక సిల్వియా తన ఇంటి పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న రాళ్లు కోసం కీ ఇచ్చిన బొంగరంలా తిరుగుతుంది. అటువంటి రాళ్లు కనపడితే ఆ పూట ఆమెకు ఇక పండగే... వాటిని ఏరుకుని మరీ దాచుకుని దాచుకుని తింటుంది. కాగా సిల్వియా రాళ్లు తినడం ఆ నోటా ఆ నోటా పాకి చివరికి మీడియాకు తెలిసింది.

దీంతో ప్రేక్షకుల ముందు సిల్వియా రాళ్లు తినే ఓ కార్యక్రమాన్ని మీడియా  సంస్థ ఏర్పాటు చేయటం విశేషం.  ఈ సందర్భంగా ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు సిల్వియా సమాధానం ఇచ్చింది... కడుపుతో ఉన్నప్పుడు ఎవరికైనా పచ్చళ్లు, అవి ఇవి తినాలని ఉంటుంది... నాకు మాత్రం రాళ్లు తినాలని ఉంటుంది ఎందుకో అనే సమాధానం ఇచ్చింది. దీంతో ఆడియన్స్ నోరు వెళ్ల పెట్టారు.  ఆ వీడియోను యూ ట్యూబ్లో పెట్టింది. దీంతో  ఆ వీడియోకు మంచి స్పందన వస్తుంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement