ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ‘సాక్షి’ కె.రాజా ప్రసాద్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) అధ్యక్షుడిగా పీవీ చంద్రన్ ఎన్నికయ్యారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన సంస్థ 76వ వార్షిక సమావేశంలో ఆయనను 2015-16కుగాను ఐఎన్‌ఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ‘మాతృభూమి’ గ్రూపు సంస్థలకు ఎండీగా ఉన్న చంద్రన్.. కిందటేడాది ఐఎన్‌ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
సమావేశంలో సోమేశ్ శర్మ(రాష్ట్రదూత్ సప్తాహిక్)ను ఐఎన్‌ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, అఖిలా ఉరంకార్(బిజినెస్ స్టాండర్డ్)ను వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. 41 మంది సభ్యులతో కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఎన్నుకున్నారు. వీరిలో కె.రాజా ప్రసాద్‌రెడ్డి (సాక్షి)తోపాటు సీహెచ్ కిరణ్(విపుల, అన్నదాత), వివేక్ గోయెంకా (ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్), జయంత్ మమెన్ మాథ్యూ(మలయాళ మనోరమ), జాకబ్ మాథ్యూ(వనిత) తదితరులున్నారు.
ఐఎన్‌ఎస్ అధ్యక్షుడిగా పీవీ చంద్రన్
Published Sat, Sep 19 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM
Advertisement
Advertisement