కువైట్‌లో రాజంపేట వాసి మృతి | Raajampet resident dies kuwait | Sakshi
Sakshi News home page

కువైట్‌లో రాజంపేట వాసి మృతి

Published Wed, Aug 12 2015 6:33 PM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

Raajampet resident dies kuwait

రాజంపేట(వైఎస్సార్‌జిల్లా): పొట్టకూటికోసం కడుపు చేత పట్టుకొని విదేశాలకు వెళ్లిన వలస కూలి అక్కడ పనిచేస్తూ.. ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. వివరాలు.. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన పి. వెంకటేశ్వర్లు(40) రెండు నెలల కిందటే బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లాడు.

కువైట్‌లోని తెరాక్ ప్రాంతంలో భవన నిర్మాణ కూలిగా పనికి కుదిరాడు. ఈ క్రమంలో తెరాక్‌లో నిర్మాణంలో ఉన్న భవనానికి అద్దాలు బిగిస్తుండగా.. ప్రమాదవశాత్తూ పై నుంచి పడి మృతిచెందాడు. ఈ విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement

పోల్

Advertisement