రైల్వే ఉద్యోగినిపై.. సహోద్యోగుల గ్యాంగ్ రేప్ | Railway worker allegedly gangraped | Sakshi
Sakshi News home page

రైల్వే ఉద్యోగినిపై.. సహోద్యోగుల గ్యాంగ్ రేప్

Published Sun, Jul 27 2014 1:09 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

Railway worker allegedly gangraped

కోల్‌కతా: మధ్యవయస్కురాలైన రైల్వే ఉద్యోగినిపై నలుగురు సహోద్యోగులే కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న దారుణ ఘటన కొల్‌కతాలో వెలుగు చూసింది. బాధితురాలిపై ఆ నలుగురు కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ ఉదంతాన్ని ఫొటోలు కూడా తీశారు. విషయాన్ని ఎవరికైనా చెప్పినా.. తమకు సహకరించకపోయినా.. ఆ ఫొటోలను నెట్‌లో పెట్టడంతోపాటు చంపేస్తామని ఆమెను బెదిరించారు. అయితే, ఆమె తనపై జరిగిన అకృత్యాన్ని ఓ టీవీ చానల్‌తో శనివారం పంచుకోవడంతో విషయం వెలుగు చూసింది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. రైల్వే ఉద్యోగి అయిన బాధితురాలి భర్త.. 2010లో జరిగిన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమెకు రైల్వేలో ఉద్యోగం లభించింది.

 

అనంతరం కొన్నాళ్లకు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇదిలావుంటే, రైల్వే శాఖలో విధి నిర్వహణలో పరిచయం అయిన నలుగురు ఉద్యోగులు ఆమెను శారీరకంగా వేధించడం ప్రారంభించారు. భర్తకు విడాకులు ఇచ్చి తమను పెళ్లి చేసుకోవాలని కూడా ఒత్తిడి తెచ్చారు. ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో అతను ఆత్మహ త్యా యత్నం చేశాడు. మరోపక్క, ఆ నలుగురు బాధితురాలిపై చిత్‌పూర్ రైల్వేయార్డులోని ఖాళీ రైలు బోగీలో పలు దఫాలుగా అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నారు. తాను నిండు గర్భిణిని అని వేడుకున్నా నిందితులు కనికరించలేదని బాధితురాలు వాపోయింది. స్పందించిన డండం జీఆర్పీ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి, నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement