ఆర్‌ఈసీ ట్యాక్స్ ఫ్రీ బాండ్లు | REC Tax Free Bonds | Sakshi
Sakshi News home page

ఆర్‌ఈసీ ట్యాక్స్ ఫ్రీ బాండ్లు

Published Sun, Sep 1 2013 1:29 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

REC Tax Free Bonds

అధిక ట్యాక్స్ శ్లాబ్‌లో ఉండి, రిస్క్‌లేని వడ్డీ ఆదాయం పొందాలనుకునే వారికి అనువైన ట్యాక్స్ ఫ్రీ బాండ్ ఇష్యూలు ప్రారంభమయ్యాయి. పన్ను ప్రయోజనాలను కలిపితే 12 శాతం వరకు రాబడిని అందించడానికి ప్రభుత్వరంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) ముందుకొచ్చింది. ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై ఎటువంటి పన్ను ప్రయోజనం లభించదు కాని, ఈ బాండ్లు అందించే వడ్డీని పన్ను లేని ఆదాయంగా పరిగణిస్తారు. అదే బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను భారం ఏర్పడుతుంది. ఆగస్టు 30న ప్రారంభమైన ఆర్‌ఈసీ ట్యాక్స్ ఫ్రీ బాండ్ ఇష్యూ సెప్టెంబర్ 23తో ముగుస్తుంది. ముందొచ్చిన వారికి ముందు అన్న ప్రాతిపదికన జరిగే ఈ ఇష్యూ మొదటి రోజునే 1.83 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఈ ఇష్యూ ద్వారా మొత్తం రూ.3,500 కోట్లు ఆర్‌ఈసీ సమీకరించనుంది.
 
 వడ్డీరేటు: 10,15, 20 సంవత్సరాల కాలపరిమితితో జారీ చేస్తున్న ఈ బాండ్లపై రిటైల్ ఇన్వెస్టర్లకు వరుసగా 8.26%, 8.71%, 8.62% వడ్డీని ఆర్‌ఈసీ ఆఫర్ చేస్తోంది. అదే వచ్చే వడ్డీపై 30 శాతం పన్ను భారం లేదనుకుంటే రాబడి వరుసగా 11.95%, 12.6%, 12.5% గిట్టుబాటవుతుంది. ప్రభుత్వరంగ సంస్థ కావడంతో దీర్ఘకాలంలో అధిక వడ్డీ ఆదాయం కావాలనుకునే వారికి ఈ బాండ్లు అనువైనవని చెప్పొచ్చు.