
ట్యాక్స్ ఫ్రీ బాండ్ల వడ్డీపై నియంత్రణ ఎత్తివేత
ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌కి దరఖాస్తు చేసుకునే రిటైల్ ఇన్వెస్టర్లకు శుభవార్త. ప్రభుత్వ సంస్థలు భారీగా విడుదల చేయనున్న ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌లో ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రభుత్వం వడ్డీరేట్ల నిబంధనలను సడలించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ చేసే వడ్డీరేట్లపై నియంత్రణను ఎత్తివేసింది. దీంతో ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌ను జారీ చేసే సంస్థలు రిటైల్ ఇన్వెస్టర్లకు నచ్చిన వడ్డీరేటును ఆఫర్ చేసే స్వేచ్ఛ లభించింది. ఇప్పటికే ఆర్‌ఈసీ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఇష్యూ ప్రారంభం కాగా త్వరలో మరిన్ని ప్రభుత్వరంగ సంస్థల ఇష్యూలు రానున్నాయి.