retail investers
-
పటిష్టంగా భారత ఆర్థిక వ్యవస్థ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితిలో ఉందని జూన్ నెలకు సంబంధించిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో (ఎఫ్ఎస్ఆర్) రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. 2024 మార్చి ఆఖరు నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో (ఎస్సీబీ) స్థూల మొండి బాకీల నిష్పత్తి (జీఎన్‌పీఏ) 12 ఏళ్ల కనిష్ట స్థాయి అయిన 2.8 శాతానికి, నికర ఎన్పీఏల నిష్పత్తి 0.6 శాతానికి తగ్గినట్లు వివరించింది. జీఎన్‌పీఏలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 2.5 శాతానికి తగ్గగలవని వివరించింది.క్రెడిట్ రిసు్కలకు సంబంధించి స్థూల స్ట్రెస్ టెస్టుల్లో ఎస్సీబీలు కనీస మూలధన అవసరాలను పాటించగలిగే స్థాయిలోనే ఉన్నట్లు వెల్లడైందని నివేదిక పేర్కొంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) సంబంధించి జీఎన్‌పీఏ నిష్పత్తి 4 శాతంగాను, రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్వోఏ) 3.3 శాతంగాను ఉన్నట్లు తెలిపింది.భౌగోళిక–రాజకీయ ఆందోళనలు, ప్రభుత్వాలపై భారీ రుణభారాలు, ద్రవ్యోల్బణాన్ని తగ్గించే దిశగా పురోగతి మందకొడిగా సాగుతుండటం వంటి అంశాల రూపంలో అంతర్జాతీయ ఎకానమీకి సవాళ్లు పెరిగాయని వివరించింది. సవాళ్లున్నప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని నివేదిక తెలిపింది.గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలి.. ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా నిలదొక్కుకునేలా అసెట్ క్వాలిటీ, పటిష్టత మెరుగుపడినట్లుగా అధ్యయనాలు చూపిస్తున్న నేపథ్యంలో గవర్నెన్స్‌కు అత్యంత ప్రాధాన్యమివ్వడంపై దృష్టి పెట్టాలంటూ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.ప్రస్తుతానికి ఆర్థిక స్థిరత్వం పటిష్టంగానే ఉందని, అయితే దాన్ని అలాగే కొనసాగించడంతో పాటు రాబోయే రోజుల్లో మరింత మెరుగుపర్చుకోవడమనేది నిజమైన సవాలుగా ఉండగలదని ఎఫ్ఎస్ఆర్ నివేదిక ముందుమాటలో ఆయన పేర్కొన్నారు. సైబర్ ముప్పులు, పర్యావరణ మార్పులు, అంతర్జాతీయ పరిణామాల వల్ల తలెత్తే ప్రతికూల ప్రభావాలు మొదలైన వాటన్నింటినీ ఆర్బీఐ పరిశీలిస్తూనే ఉంటుందన్నారు. టెక్నాలజీపై బ్యాంకులు తగినంత స్థాయిలో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.నివేదికలోని మరిన్ని అంశాలు..బ్యాంక్ గ్రూపుల వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) 2023–24 ప్రథమార్ధంలో జీఎన్‌పీఏ నిష్పత్తి గణనీయంగా 76 శాతం మేర తగ్గింది. ప్రొవిజనింగ్ కవరేజీ నిష్పత్తి (పీసీఆర్) మెరుగుపడింది.అర్థ సంవత్సరంలో కొత్త ఎన్పీఏలు కూడా వివిధ బ్యాంకు గ్రూపుల్లో తగ్గాయి. పూర్తి సంవత్సరంలో మొండి బాకీల రైటాఫ్‌లు దిగివచి్చనప్పటికీ రైటాఫ్ నిష్పత్తి మాత్రం క్రితం సంవత్సరం స్థాయిలోనే ఉంది.2023–24 ద్వితీయార్ధంలో పీఎస్‌బీలు, ఫారిన్ బ్యాంకుల్లో రుణాల మంజూరు పెరగ్గా, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కాస్త నెమ్మదించింది.మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోలో సర్వీ సుల రంగానికి ఇచ్చిన రుణాలు, వ్యక్తిగత రుణాల వాటా పెరిగింది. ప్రైవేట్ బ్యాంకుల రుణ వృద్ధిలో వ్యక్తిగత రుణాల వాటా సగానికి పైగా ఉంది.ఇటీవలి కాలంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) వాల్యూమ్స్ గణనీయంగా పెరగడమనేది రిటైల్ ఇన్వెస్టర్లకు సవాలుగా మారొచ్చు. చిన్న ఇన్వెస్టర్లు సరైన రిస్కు మేనేజ్మెంట్ విధానాలను పాటించకపోతుండటమే ఇందుకు కారణం. కాబట్టి ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడం కీలకం. ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో 2022–23లో 65 లక్షలుగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 2023–24లో ఏకంగా 95.7 లక్షలకు పెరిగింది. -
ఎఫ్‌అండ్‌వోలో రిటైలర్లకు నష్టాలే
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) రిటైల్ ఇన్వెస్టర్లు చేపట్టిన ఈక్విటీ డెరివేటివ్(ఎఫ్‌అండ్‌వో) లావాదేవీలలో 89 శాతం మందికి నష్టాలే మిగిలినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నివేదిక తాజాగా వెల్లడించింది. ప్రతీ 10 మంది రిటైల్ ఇన్వెస్టర్లలో 9 మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లావాదేవీలలో నష్టపోయినట్లు పేర్కొంది. దీంతో అటు స్టాక్ ఎక్సే్ఛంజీలు, ఇటు బ్రోకర్లు అదనపు రిస్కులపై సమాచారాన్ని అందించేలా త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలియజేసింది. 2019–22 మధ్య కాలంలో టాప్–10 స్టాక్ బ్రోకర్ల వద్ద నమోదైన రిటైల్ ఇన్వెస్టర్ల గతేడాది ఎఫ్‌అండ్‌వో టర్నోవర్ ఆధారంగా అధ్యయనం చేపట్టింది. మొత్తం రిటైల్ క్లయింట్ల టర్నోవర్‌లో ఇది 67% వాటాకాగా.. 89 శాతం మందికి నష్టాలే మిగిలినట్లు వెల్లడించింది. అంటే ప్రతీ 10 మందిలో 9 మంది ఎఫ్‌అండ్‌వో లావాదేవీల ద్వారా సగటున రూ. 1.1 లక్షలు నష్టపోయినట్లు తెలియజేసింది. 90% యాక్టివ్ ట్రేడర్లను పరిగణిస్తే ఈ నష్టం రూ. 1.25 లక్షలుగా నమోదైనట్లు వెల్లడించింది. వెరసి డెరివేటివ్ విభాగంలో 11% మంది రిటైలర్లు మాత్రమే లాభాలు ఆర్జించారు. సగటున రూ. 1.5 లక్షల లాభం నమోదైంది. చదవండి: Union Budget 2023: అరుదైన ఘనత నిర్మలా సీతారామన్ సొంతం.. అదో రేర్ రికార్డ్! -
లాక్డౌన్ ఎఫెక్ట్: రంగంలోకి కొత్త ఇన్వెస్టర్లు
కరోనా ప్రేరిపిత లాక్‌డౌన్‌తో భారత స్టాక్మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్లు రాక పెరిగింది. కొత్తవారి ఆగమనంతో ఎక్చ్సేంజీల ట్రేడింగ్ యాక్టివిటీ భారీస్థాయిలో జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో 25లక్షల కొత్త డీమాట్ ఖాతాలు తెరవబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జూన్‌లో జరిగిన మార్కెట్ యాక్షన్‌ను పరిశీలిస్తే ఈ ట్రెండ్‌ను నిర్ధారించుకోవచ్చు. నిఫ్టీ ఇండెక్స్ ఈ జూన్‌లో 7శాతం పెరిగింది. నెల ప్రాతిపదికన మార్కెట్ టర్నోవర్ 37శాతం వృద్ధి చెంది రూ.14.6లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే జూన్‌లో ఇన్స్టిట్యూషనల్ విభాగంలో టర్నోవర్ 9శాతం వృద్ధిని సాధించి రూ.5లక్షల కోట్లుగా నమోదైనట్లు ఎన్ఎస్ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకే రిటైల్ ఇన్వెస్టర్లు పెరిగారు: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌తో విధింపుతో చాలామంది ఇళ్లలో చిక్కుకుపోయారు. అందులో భారీగా డబ్బున్న వారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధం కాకపోవడంతో ఖాళీ సమయాన్ని గడిపేందుకు ఎలాంటి ఇతర ప్రత్యమ్నాయాలు లేకపోవడంతో వారు ట్రేడింగ్ పట్ల ఆకర్షితులయ్యారు. దాదాపు అన్ని బ్రోకరేజ్ సంస్థలు ఉచిత డీమాట్ ఖాతా ప్రారంభాన్ని అందిస్తున్నాయి. దీనికి తోడు కొత్తవారికి ప్రోత్సాహకాలు, డిస్కౌంట్లు ఇస్తుండటం కూడా స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెరిగారు. ఏయే బ్రోకరేజ్‌లో ఎంతమంది: ఈ జూన్ క్వార్టర్లో టాప్-12 బ్రోకరేజ్ సంస్థలు దాదాపు 13లక్షల కొత్త డీమాట్ అకౌంట్లను ప్రారంభించినట్లు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజీటరీ లిమిటెడ్ తెలిపింది. అందులో అత్యధికంగా జిరోదా బ్రోకింగ్ 5,26,917 కొత్త ఖాతాలను ప్రారంభించింది. ఏంజిల్ బ్రోకింగ్ 1,90,397 అకౌంట్లు, 5పైసా క్యాపిటల్ 1.31లక్షల ఖాతాలు నమోదయాయ్యాయి. ఈ నగరాల నుంచే అధికంగా రాక: కొత్తగా స్టాక్ మార్కెట్లో ప్రవేశించినవారిలో 80శాతం మధ్య, చిన్నతరహా నగరాలైన నాసిక్, జైపూర్, పాట్నా, కన్నూర్, గుంటూర్, తిరువళ్లూర్, నైనిటాల్‌తో పాటు ఇతర టైర్-2, టైర్-3 నగరాలను నుంచి వస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థలు తెలిపారు. స్టాక్ మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్లు రాక కొత్తేంకాదని అయితే కరోనా ప్రేరిపిత లాక్డౌన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు, కొత్త ఇన్వెస్టర్లు కిందటి ఏడాదితో పోలిస్తే మరింత పెరిగారని బ్రోకరేజ్ సంస్థలు తెలిపాయి. ‘‘ ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల నగదు విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్ల కాంట్రిబ్యూషన్ పెరుగుతోంది. భారత్‌లో కూడా అదే విధంగా జరుగుతుంది. గత రెండేళ్లలో నగదు విభాగంలో పాల్గోనే రిటైల్ ఇన్వెసర్ల సంఖ్య క్రమంగా 50-52శాతానికి చేరుకుంది.’’ బీఎన్పీ పారిబా సీఈవో జైదీప్ అరోరా తెలిపారు. -
ఈ మార్కెట్లో ఏం చెయ్యాలి?
ప్రస్తుతం మార్కెట్లు గరిష్ట స్థాయికి ఎగిసినప్పటికీ.. సవాళ్లు మాత్రం అలాగే ఉన్నాయి. స్థూల ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో స్వల్పకాలికంగానైనా.. మధ్యకాలికంగానైనా.. దేశీ మార్కెట్లు మరీ భారీగా పెరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా అప్పుడప్పుడు భారీ హెచ్చుతగ్గులకు లోనుకావడం మినహా పరిమిత శ్రేణిలో అక్కడక్కడే తిరుగాడే పరిస్థితి నెలకొంది. మరి.. ఇలాంటప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు ఏయే రంగాల్లో.. ఏయే స్టాక్స్‌పై దృష్టి సారించాలి? అది తెలియజెప్పే ప్రయత్నమిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు నిర్దిష్ట షేర్లకు పరిమితమైతే మంచిది. ప్రధానంగా ఐటీ, ఫార్మా వంటి ఎగుమతి ఆధారిత రంగాల కంపెనీల వైపు దృష్టి పెట్టొచ్చు. ఎందుకంటే రూపాయి క్షీణించడం వల్ల ఈ సంస్థలకు గణనీయంగా ప్రయోజనం కలుగుతుంది. ఐటీ రంగానికి సంబంధించి.. ఇన్ఫోసిస్, విప్రో, మైండ్‌ట్రీ, కేపీఐటీ కమిన్స్ వంటివి బాగానే ఉన్నాయి. ఇక ఫార్మా రంగం విషయానికొస్తే.. లుపిన్, సన్ ఫార్మా, అలెంబిక్ వంటివి మెరుగ్గా ఉండే అవకాశముంది. అలాగే, ఎఫ్ఎంసీజీ, మీడియా, కన్సూమర్ డ్యూరబుల్స్ వంటి రంగాల్లోనూ కొన్ని స్టాక్స్ దీర్ఘకాలిక ప్రాతిపదికన మంచి రాబడులే అందించగలవు. ఈ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, ఐటీసీ వంటివి ఫర్వాలేదు. వడ్డీ రేట్ల ప్రభావముండే రంగాలకు దూరం... దేశీయ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం ఒక రకమైన అనిశ్చితి నెలకొంది. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల తర్వాతే దీనిపై ఒక స్పష్టత వస్తుందని నా అంచనా. అప్పుడే ఎకానమీ కూడా స్థిరంగా కోలుకునే అవకాశముంది. ఇలాంటివన్నీ కూడా వడ్డీ రేట్లతో ముడిపడి ఉన్న రంగాలపై ప్రభావాలు చూపే అవకాశముంది. కాబట్టి రికవరీ కనిపించే దాకా బ్యాంకులు, రియల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వడ్డీ రేట్ల ప్రభావిత రంగాల స్టాక్స్‌కు కాస్త దూరంగా ఉండటం మంచిది. స్టాక్మార్కెట్లపై అవగాహన ఉన్న ఇన్వెస్టర్లు.. మార్కెట్లో పటిష్టమైన స్థానంతో పాటు వ్యాపారావకాశాలు, లాభదాయకత మెరుగ్గా ఉన్న సంస్థల షేర్లపైన దృష్టి పెట్టొచ్చు. తక్కువ రుణభారం, ఎక్కువ ఆదా యం వచ్చేవి, ఆకర్షణీయమైన వేల్యుయేషన్స్, సమర్థమంతమైన మేనేజ్మెంట్ ఉన్న కంపెనీలను ఎంచుకోవచ్చు. ఇక మార్కెట్లపై పెద్దగా అవగాహన లేని వారు నేరుగా ఇన్వెస్ట్ చేయడం కాకుండా.. మ్యుచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. ఇందుకోసం విడతలవారీగా పెట్టుబడులు పెట్టేలా.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) విధానం ఎంచుకుంటే అనువుగా ఉంటుంది. షరా మామూలుగా చెప్పే విషయాలేమిటంటే.. స్టాక్‌మార్కెట్లలో పెట్టే పెట్టుబడుల్లో రిస్కు ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసినా, ముందు కొంతైనా అధ్యయనం చేయడం మంచిది. అలాగే, తమ వయసు, ఆదాయం, రిస్కు సామర్థ్యం, ఎంతకాలం పెట్టుబడులు పెట్టగలరు, ఆర్థిక లక్ష్యాలు తది తర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే ఈక్విటీల్లో పెట్టుబడులపై ఒక నిర్ణయానికి రావాలి. -
ట్యాక్స్ ఫ్రీ బాండ్ల వడ్డీపై నియంత్రణ ఎత్తివేత
ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌కి దరఖాస్తు చేసుకునే రిటైల్ ఇన్వెస్టర్లకు శుభవార్త. ప్రభుత్వ సంస్థలు భారీగా విడుదల చేయనున్న ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌లో ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రభుత్వం వడ్డీరేట్ల నిబంధనలను సడలించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ చేసే వడ్డీరేట్లపై నియంత్రణను ఎత్తివేసింది. దీంతో ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌ను జారీ చేసే సంస్థలు రిటైల్ ఇన్వెస్టర్లకు నచ్చిన వడ్డీరేటును ఆఫర్ చేసే స్వేచ్ఛ లభించింది. ఇప్పటికే ఆర్ఈసీ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఇష్యూ ప్రారంభం కాగా త్వరలో మరిన్ని ప్రభుత్వరంగ సంస్థల ఇష్యూలు రానున్నాయి.