
కొనసాగుతున్న రూపాయి పతనం
ముంబయి : రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. నిన్న 104 పైసలు కోల్పోయిన రూపాయి మంగళవారం ఉదయం మరో 100 పైసల దాకా నష్టపోతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మళ్లీ రూ. 65 దిగిపోయింది. ప్రస్తుతం 65 రూపాయల 30 పైసలకు సమీపంలో ట్రేడవుతోంది. రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయి.
రూపాయి పతనంతో స్టాక్ మార్కెట్లు కూడా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పడుతూ 18,350కి సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్ల దాకా కోల్పోతూ 5,410కి సమీపంలో కొనసాగుతోంది. రూపాయి పతనం ప్రభావం వల్ల ఈవారమో.. వచ్చే వారమో పెట్రోల్, డీజిల్ ధరలు 2, 3 రూపాయలు పెరిగే అవకాశముంది. వీటితో పాటు సెల్‌ఫోన్ సహా దిగుమతి చేసుకునే అన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి.