‘సాక్షి స్పెల్ బీ’ రిజిస్ట్రేషన్ల గడువు సెప్టెంబర్ 15
హైదరాబాద్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సాక్షి ఇండియా స్పెల్ బీ’ పోటీలకు రిజిస్ట్రేషన్ల గడువు ఈ నెల 15వ తేదీతో ముగియనుంది. సాక్షి స్పెల్ బీ పోటీలకు పాఠశాలల వారీగా, వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. నాలుగు రౌండ్లలో, నాలుగు కేటగిరీల్లో ఈ పోటీలు జరుగుతాయి. తొలి రౌండ్‌లో పాఠశాలల వారీగా సెప్టెంబర్ 30వ తేదీన, వ్యక్తిగతంగా అక్టోబర్ 4వ తేదీన ప్రిలిమినరీ పోటీలు జరుగుతాయి. రెండో రౌండ్‌లో నవంబర్ 1వ తేదీన క్వార్టర్ ఫైనల్స్, మూడో రౌండ్‌లో నవంబర్ 15వ తేదీన సెమీఫైనల్స్, నాలుగో రౌండ్‌లో డిసెంబర్ 4వ తేదీన ఫైనల్స్ జరుగుతాయి.
కేటగిరీ-1లో ఒకటి, రెండో తరగతులు; కేటగిరీ-2లో 3, 4 తరగతులు; కేటగిరీ-3లో 5, 6, 7 తరగతులు; కేటగిరీ-4లో 8, 9, 10 తరగతుల వారికి పోటీలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతి రూ. 25వేలు, రెండో బహుమతి రూ. 15 వేలు, మూడో బహుమతి రూ. 10 వేలతోపాటు ‘చాంపియన్ స్కూల్ ట్రోఫీ’, విజేతలకు మెడల్స్, పాల్గొన్న విద్యార్థులంద రికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేస్తారు.
www.indiaspellbee.in వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 250 (ఇండియా స్పెల్స్ రిఫరెన్స్ బుక్‌తో కలిపి). ఫీజును ‘ఇండియా స్పెల్ బీ, అకౌంట్ నంబర్ 6361514081, ఇండియన్ బ్యాంక్, బంజారాహిల్స్ శాఖ, హైదరాబాద్’లో జమ చేయాలి. మరిన్ని ఇతర వివరాలకు www. sakshiindiaspellbee@gmail.comకు ఈ-మెయిల్ ద్వారా లేదా 040-23256134, 9505551099, 9705199924 నంబర్లలో సంప్రదించవచ్చు.