spell bee competitions
-
సాక్షి స్పెల్ బి పరీక్షలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన
-
సాక్షి మ్యాథ్స్ బీ కేటగిరి 4 తెలంగాణ గ్రాండ్ ఫైనల్స్
-
సాక్షి మ్యాథ్స్ బీ కేటగిరి 4 గ్రాండ్ ఫైనల్స్
-
సాక్షి మ్యాథ్స్ బీ కేటగిరి 3 గ్రాండ్ ఫైనల్స్
-
డల్లాస్‌లో యోగా డే దినోత్సవ వేడుకలు
డల్లాస్ : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్టీ) ఆధ్వర్యంలో డల్లాస్(ఇర్వింగ్)లో ఆదివారం జూన్ 17న జరిగిన 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 300 మందికి పైగా యువతీ, యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాన్సుల్ అశోక్ కుమార్, ఇర్వింగ్ సిటీ మేయర్ ప్రోటెం ఆలన్ మీఘర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంజీఎంఎన్టీ కార్యదర్శి రావు కల్వల అందరికీ స్వాగతం పలుకుతూ ఈ గాంధీ మెమోరియల్ దగ్గర యోగ దినోత్సవం జరుపుకోవడం ఇది నాల్గవ పర్యాయమని, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో అందరూ ఉత్సాహంగా యోగ చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి సహకరించిన భారత కాన్సులేట్ అధికారులకు, ఇర్వింగ్ సిటీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంజీఎంఎన్టీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ షబ్నమ్ మోద్గిల్ కార్యవర్గ సభ్యులను అందరికీ పరిచయం చేశారు. ఎంజీఎంఎన్టీ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ 5,000 సంవత్సరాల క్రితం రిషికేష్ యోగాకు జన్మస్థలం అయ్యిందని, 2014 లో ఐక్యరాజసమితి జూన్ 21 ని యోగా దినోత్సవంగా ప్రకటించడంతో ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలు యోగా దినోత్సవాన్ని పాటిస్తున్నాయని తెలిపారు. గాంధీ మహాత్ముడు కూడా యోగాకు, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, ఈ రోజు అదే గాంధీ స్మారక స్థలంలో యోగా దినోత్సవం జరుపుకోవడం సముచితంగా ఉందని అభిప్రాయపడ్డారు. కాన్సుల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్, మహాత్మా గాంధీ మెమోరియల్ డల్లాస్‌తో కలిపి యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అనుసరించి ఐక్యరాజ్య సమితి జూన్ 21న యోగా దినోత్సవాన్ని పాటించడం చారిత్రాత్మక విషయమని, నిత్యం అందరూ యోగా అభ్యసించాలని కోరారు. విశాలమైన థామస్ జెఫెర్సన్ పార్కులో సుందరమైన మహాత్మా గాంధీ మెమోరియల్ ను ఏర్పాటు చేసిన సభ్యులందరకీ ఇర్వింగ్ సిటీ మేయర్ ప్రోటెం ఆలన్ మీఘర్ కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా యోగాలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సిటీ తరపున ఏ సహాయం చేయడానికైనా తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఎంజీఎంఎన్టీ కో-చైర్మన్ కమల్ కౌషల్ యోగా ప్రాముఖ్యాన్ని వివరించారు. యోగా శిక్షకుడు విజయ్, వారి బృందంతో యోగా శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించ వలసినదిగా ఆహ్వానించారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ యోగా శిక్షణలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదే వేదిక పై ప్రతిష్ఠాత్మకమైన ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలలో’ ప్రథమ స్థానం సాధించిన కార్తీక్ నెమ్మాని, ద్వితీయ స్థానం పొందిన నైన మోడీ, తృతీయ స్థానంలో వచ్చిన అభిజయ్ కొడాలి, వారి తల్లిదండ్రులను, పిల్లలకు శిక్షణ ఇచ్చిన ‘జియోస్పెల్ అకాడమీ’ నిర్వాహకులు విజయ్ రెడ్డి, గీత మంకులను ఎంజీఎంఎన్టీ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర, ఇతర బోర్డు సభ్యులతో కలసి ఘనంగా సన్మానించారు. ఎంజీఎంఎన్టీ కోశాధికారి బి. ఎన్. రావు ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన అధికారులకు, కార్యకర్తలకు, మీడియా వారికి, బాంబే ఫోటోగ్రఫీ వారికి, మ్యూజిక్ మస్తీ వారికి, హర్యానా సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఘనంగా యోగా డే వేడుకలు
డల్లాస్ : ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అమెరికాలోని డల్లాస్, టెక్సాస్‌లో ఎన్నారైలు మహాత్మ గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బోర్డ్ సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, డా. రావు కలవర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు 300ల మంది పాల్గొన్నారు. యోగాసనాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం మెడిటేషన్‌తో పూర్తి అయినట్లు తెలిపారు. విజయ్ రెడ్డి, గీతా రెడ్డి నేతృత్వంలోని జియో స్పెల్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన స్పెల్ బి పోటీల్లో కార్తిక్ నెమ్మని విజేతగా నిలిచారు. వరుసగా రెండు, మూడు స్థానాల్లో నాస్య మోదీ, అభిజయ్ కొడాలిలు నిలిచారని కోచ్ విజయ్ రెడ్డి తెలిపారు. -
సాక్షి ఇండియా స్పెల్ బీ విజేతలు వీరే
హైదరాబాద్ : ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ–2017 (కేటగిరీ–2, తెలంగాణ రాష్ట్రం) విజే తలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఉ త్కంఠగా కొనసాగాయి. ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేత లు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషపై, మ్యాథ్స్‌లో అంతర్గత భయాలు పోగొట్టి, నైపుణ్యాన్ని వెలికి తీయడం తో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పోటీలు కలిగించాయని వారు చెప్పారు. స్పెల్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్, కొండాపూర్ స్కూల్లో చదువుతున్న అర్నవ్ కౌల్ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్, కొండాపూర్ స్కూల్లో చదువుతున్న శ్రేయ కల్లూరి కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్‌బీ ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్, కొండాపూర్ స్కూల్లో చదువుతున్న ఆరవ్ శెట్టి కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని గీతాంజలి దేవశాల స్కూల్లో చదువుతున్న మయూక్ జయసింహా కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్‌బీ తృతీయ బహుమతి: మిర్యాలగూడలోని వర్డ్ – డీడ్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్న డి. జయసూర్య మురారి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని సెయింట్ థెరిసా హై స్కూల్లో చదువుతున్న ఎస్. నిధి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకం, రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. -
సాక్షి ఇండియా స్పెల్ బీ విజేతలు వీరే
హైదరాబాద్ : ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ–2017 (కేటగిరీ–1, తెలంగాణ రాష్ట్రం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషపై, మ్యాథ్స్ విషయంలో అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడంతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. స్పెల్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని కౌశల్య గ్లోబల్ స్కూల్లో చదువుతున్న ఎన్.హిృదయ్ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాదర్గుల్ బ్రాంచిలో చదువుతున్న అజిత్ కుమార్ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్‌బీ ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని భారతి విద్యాభవన్ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్ బ్రాంచిలో చదువుతున్న ఎం.టీస్తా కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, అత్తాపూర్ బ్రాంచిలో చదువుతున్న జోయా అహ్మద్ కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్‌బీ తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేçషనల్ స్కూల్, కొండాపూర్‌లో చదువుతున్న స్వరా మిశ్రా కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేçషనల్ స్కూల్, కొండాపూర్‌లో చదువుతున్న స్వరా మిశ్రా కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. -
‘సాక్షి స్పెల్ బీ’ రిజిస్ట్రేషన్ల గడువు సెప్టెంబర్ 15
హైదరాబాద్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సాక్షి ఇండియా స్పెల్ బీ’ పోటీలకు రిజిస్ట్రేషన్ల గడువు ఈ నెల 15వ తేదీతో ముగియనుంది. సాక్షి స్పెల్ బీ పోటీలకు పాఠశాలల వారీగా, వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. నాలుగు రౌండ్లలో, నాలుగు కేటగిరీల్లో ఈ పోటీలు జరుగుతాయి. తొలి రౌండ్లో పాఠశాలల వారీగా సెప్టెంబర్ 30వ తేదీన, వ్యక్తిగతంగా అక్టోబర్ 4వ తేదీన ప్రిలిమినరీ పోటీలు జరుగుతాయి. రెండో రౌండ్లో నవంబర్ 1వ తేదీన క్వార్టర్ ఫైనల్స్, మూడో రౌండ్లో నవంబర్ 15వ తేదీన సెమీఫైనల్స్, నాలుగో రౌండ్లో డిసెంబర్ 4వ తేదీన ఫైనల్స్ జరుగుతాయి. కేటగిరీ-1లో ఒకటి, రెండో తరగతులు; కేటగిరీ-2లో 3, 4 తరగతులు; కేటగిరీ-3లో 5, 6, 7 తరగతులు; కేటగిరీ-4లో 8, 9, 10 తరగతుల వారికి పోటీలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతి రూ. 25వేలు, రెండో బహుమతి రూ. 15 వేలు, మూడో బహుమతి రూ. 10 వేలతోపాటు ‘చాంపియన్ స్కూల్ ట్రోఫీ’, విజేతలకు మెడల్స్, పాల్గొన్న విద్యార్థులంద రికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేస్తారు. www.indiaspellbee.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 250 (ఇండియా స్పెల్స్ రిఫరెన్స్ బుక్‌తో కలిపి). ఫీజును ‘ఇండియా స్పెల్ బీ, అకౌంట్ నంబర్ 6361514081, ఇండియన్ బ్యాంక్, బంజారాహిల్స్ శాఖ, హైదరాబాద్’లో జమ చేయాలి. మరిన్ని ఇతర వివరాలకు www. sakshiindiaspellbee@gmail.comకు ఈ-మెయిల్ ద్వారా లేదా 040-23256134, 9505551099, 9705199924 నంబర్లలో సంప్రదించవచ్చు.