డల్లాస్ : ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అమెరికాలోని డల్లాస్, టెక్సాస్‌లో ఎన్నారైలు మహాత్మ గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బోర్డ్ సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, డా. రావు కలవర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు 300ల మంది పాల్గొన్నారు. యోగాసనాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం మెడిటేషన్‌తో పూర్తి అయినట్లు తెలిపారు. విజయ్ రెడ్డి, గీతా రెడ్డి నేతృత్వంలోని జియో స్పెల్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన స్పెల్ బి పోటీల్లో కార్తిక్ నెమ్మని విజేతగా నిలిచారు. వరుసగా రెండు, మూడు స్థానాల్లో నాస్య మోదీ, అభిజయ్ కొడాలిలు నిలిచారని కోచ్ విజయ్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment