హైదరాబాద్ : ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ–2017 (కేటగిరీ–1, తెలంగాణ రాష్ట్రం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు.
ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషపై, మ్యాథ్స్ విషయంలో అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడంతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
స్పెల్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని కౌశల్య గ్లోబల్ స్కూల్‌లో చదువుతున్న ఎన్.హిృదయ్ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు.
మ్యాథ్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాదర్‌గుల్ బ్రాంచిలో చదువుతున్న అజిత్ కుమార్ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు.
స్పెల్‌బీ ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని భారతి విద్యాభవన్ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్ బ్రాంచిలో చదువుతున్న ఎం.టీస్తా కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు.
మ్యాథ్‌బీ ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, అత్తాపూర్ బ్రాంచిలో చదువుతున్న జోయా అహ్మద్ కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు.
స్పెల్‌బీ తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేçషనల్ స్కూల్, కొండాపూర్‌లో చదువుతున్న స్వరా మిశ్రా కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు.
మ్యాథ్‌బీ తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేçషనల్ స్కూల్, కొండాపూర్‌లో చదువుతున్న స్వరా మిశ్రా కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment