మార్కెట్లోకి శామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్,
మార్కెట్లోకి శామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్,
Published Fri, Sep 6 2013 12:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
బెర్లిన్: చేతికి పెట్టుకునే స్మార్ట్‌వాచ్ ‘గెలాక్సీ గేర్’ను శామ్‌సంగ్ కంపెనీ ఆవిష్కరించింది. దీంతో పాటు గెలాక్సీ నోట్ 2 కంటే సన్ననైన, తేలికైన 4జీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 3ను కూడా తీసుకొచ్చింది. ఇక్కడ జరుగుతున్న ఐఎఫ్‌ఏ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ ఫెయిర్‌లో ఈ డివైస్‌లను ప్రదర్శనకు ఉంచింది. ఈ గెలాక్సీ గేర్, గెలాక్సీ నోట్ 3 విక్రయాలను భారత్‌తో సహా ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. గెలాక్సీ గేర్ ధర 299(దాదాపు రూ.19,700) డాలర్లని వివరించింది. గెలాక్సీ నోట్ 3 ధర వెల్లడికాలేదు.
యాపిల్‌తో పోటీలో ముందంజ...
యాపిల్ కంపెనీతో సమరం నేపథ్యంలో గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌ను శామ్‌సంగ్ కంపెనీ మార్కెట్లోకి తెస్తోంది. ఐఫోన్‌లు తయారు చేసే యాపిల్ కంపెనీ త్వరలో స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి తెస్తుం దనే అంచనాలున్నాయి. దీని తర్వాత గెలాక్సీ గేర్‌ను మార్కెట్లోకి తెస్తే యాపిల్ కంపెనీని శామ్‌సంగ్ అనుసరించిందన్న అపప్రథ నుంచి తప్పిం చుకోవడానికి శామ్‌సంగ్ కంపెనీ ఈ గెలాక్సీగేర్‌ను అందిస్తోందని నిపుణులంటున్నారు. కాగా ఈ ఏడాది జూన్‌లో సోనీ కంపెనీ ఆండ్రాయిడ్‌ఆధారిత స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. ఈ నెల నుంచి ఈ స్మార్ట్‌వాచ్ విక్రయాలు ఆరంభమయ్యే అవకాశాలున్నాయి.
గెలాక్సీ గేర్ విశిష్టతలు...1. 6 అంగుళాల స్క్రీన్, 2.6 ఔన్స్‌ల బరువు, 1.9 మెగా పిక్సెల్ కెమెరా, యూజర్లు హ్యాండ్స్ ఫ్రీ కాల్స్ చేసుకోవడానికి బిల్టిన్ స్పీకర్, నడిచేటప్పుడు అడుగులు లెక్కించే స్టెప్-కౌంటింగ్ పెడో మీటర్, ఎస్ వాయిస్ వంటి ప్రత్యేకతలున్నాయి. మొత్తం 60ఆప్‌లు ప్రి లోడెడ్‌గా ఈ వాచ్ లభిస్తుంది. గెలాక్సీ గేర్‌తో చేతులు ఉపయోగించకుండానే కాల్స్ చేయొచ్చు, మెసేజ్‌లు పంపించవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ వాచ్‌తో తీసిన వీడియోలను, ఫొటోలను బ్లూటూత్ ద్వారా గెలాక్సీ నోట్ 3 వంటి మొబైల్స్‌కు పంపుకోవచ్చు.
గెలాక్సీ నోట్ 3 ప్రత్యేకతలు..,
ఒకేసారి మల్టిఫుల్ ఫ్రేమ్స్‌ను యూజర్లు ఓపెన్ చేసుకునేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేశామని కంపెనీ తెలిపింది. 5.7 అంగుళాల సూపర్ అమెలెడ్ స్క్రీన్, స్టైలస్(ఎస్ పెన్), 13 మెగా పిక్సెల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, అదనపు మెమెరీ కోసం మైక్రో ఎస్‌డీ కార్డ్ వంటి ప్రత్యేకతలున్నా యి. వామ్ టెక్సర్-టచ్ కవర్‌ను తొలిసారిగా అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. డేటాను సురక్షితంగా ఉంచే కంటైనర్ ఫోల్డర్ (శామ్‌సంగ్ నాక్స్ ఆప్సన్ ద్వారా పనిచేస్తుంది) ఈ ఫోన్ ప్రత్యేకత.
Advertisement