'దావూద్ జాడ తెలియదనడం పెద్ద తప్పు' | Saying no idea where Dawood is a mistake: Ex-Maha ommissioner | Sakshi
Sakshi News home page

'దావూద్ జాడ తెలియదనడం పెద్ద తప్పు'

Published Tue, May 5 2015 7:17 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

'దావూద్ జాడ తెలియదనడం పెద్ద తప్పు'

'దావూద్ జాడ తెలియదనడం పెద్ద తప్పు'

ముంబై: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడో తెలియదంటూ కేంద్ హోంమంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనపై ముంబై మాజీ పోలీసు కమిషనర్ ఎంఎన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన ప్రకటనను పెద్ద తప్పుగా ఆయన వర్ణించారు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ రక్షణలో దావూద్ ఉన్నాడని మన నిఘా సంస్థలు నెత్తినోరు కొట్టుకుంటుంటే, అతడి ఆచూకీ గురించి తెలియదని కేంద్రం ప్రకటన చేయడం పెద్ద తప్పు అని పేర్కొన్నారు.

దావూద్ ను ఐఎస్ఐ మట్టుబెట్టే అవకాశం లేకపోలేదన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఐఎస్ఐ ప్రత్యక్ష పర్యవేక్షణలో పాకిస్థాన్ లోనే దావూద్ తలదాచుకున్నాడని ఎంఎన్ సింగ్ స్పష్టం చేశారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న దావూద్ ఇబ్రహీం ఎక్కడవున్నాడో తెలియదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరాతిభాయ్ చౌదరి లోక్ సభకు నేడు తెలిపారు.

Advertisement
Advertisement