బాలికను తల్లిని చేసిన శివసేన నేత.. అరెస్టు | Shiv Sena leader held over rape allegations | Sakshi
Sakshi News home page

బాలికను తల్లిని చేసిన శివసేన నేత.. అరెస్టు

Published Sat, Sep 6 2014 4:01 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

బాలికను తల్లిని చేసిన శివసేన నేత.. అరెస్టు - Sakshi

బాలికను తల్లిని చేసిన శివసేన నేత.. అరెస్టు

తాను నడిపించే స్కూల్లో చదువుతున్న ఓ బాలికపై అత్యాచారం చేసి.. ఆమెను తల్లిని చేసిన శివసేన నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే ఆ బాలిక ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాసుదేవ్ నంబియార్ (61) జిల్లా శివసేన ఉప నాయకుడు. ఆయనకు కాశ్మీరియా టౌన్షిప్లో ఓ స్కూలు ఉంది. ఆ స్కూల్లో చదివే అమ్మాయి విషయంలోనే నంబియార్ను పోలీసులు అరెస్టు చేశారు.

తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయిని గుడికి తీసుకెళ్లే నెపంతో పలుమార్లు ఆయన బయటకు తీసుకెళ్లారని, థానెలోని ఓ ప్రాంతంలో ఆమెపై పదే పదే అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. అనంతరం ఆ బాలిక గర్భవతి అయ్యి.. ఈ వారం మొదట్లోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.దాంతో ఆస్పత్రి నిర్వాహకులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే పోలీసులు నంబియార్పై కేసు పెట్టి, అరెస్టు చేశారు.  స్థానిక మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరచగా సెప్టెంబర్11వ తేదీ వరకు పోలీసు కస్టడీకి ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement