నాటకీయంగా రద్దీ రోడ్డుపై కూలిన విమానం | small plane crash in Washington | Sakshi
Sakshi News home page

నాటకీయంగా రద్దీ రోడ్డుపై కూలిన విమానం

Published Thu, May 4 2017 1:30 PM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM

నాటకీయంగా రద్దీ రోడ్డుపై కూలిన విమానం

నాటకీయంగా రద్దీ రోడ్డుపై కూలిన విమానం

అమెరికాలో ఓ చిన్న విమానం నాటకీయరీతిలో నడిరోడ్డుపై కూలిపోయింది. వాషింగ్టన్‌ లోని ముకిల్‌టియోలో మంగళవారం ఓ చిన్న విమానం రద్దీగా ఉన్న నడిరోడ్డుపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిశాయి. అదృష్టం బాగుండి ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. విమానం ఇంజన్‌లో సాంకేతికలోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్‌ సురక్షితంగా తప్పించుకున్నాడు.

ఒక్కసారిగా కిందవైపుగా వచ్చిన విమానం కరెంటు వైర్లను తాకడంతో ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో విమానంలో మంటలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఈ ఘటనను ఓ వాహనదారుడు కెమెరాలో బంధించాడు. సినిమాలో భారీ గ్రాఫిక్స్‌ ను తలపించేరీతిలో జరిగిన ఈ వాస్తవిక ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement