small plane crash
-
కూలిన విమానం.. తొమ్మిది మంది దుర్మరణం
Sweden Plane Crash స్వీడన్లో చిన్నసైజు విమానం కూలిన దుర్ఘఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో పైలట్ సహా ఎనిమిది మంది స్కై డైవర్లు ఉన్నట్లు సమాచారం. గురువారం స్టాక్హోంకి వంద మైళ్ల దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్వీడన్ జాయింట్ రెస్క్యూ కో ఆర్టినేషన్ సెంటర్ ప్రతినిధులు సహాయక చర్యలకు రంగంలోకి దిగారు. విమానం దిగే టైంలోనే ఘటన జరిగిందని భావిస్తున్నారు. కాగా, ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్వీడన్ ప్రభుత్వం.. బాధితుల కుటుంబాలను ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. 2019లో ఇలాగే ఓ చిన్న విమానం స్కై డైవర్లతో వెళ్తుండగా.. ఈశాన్య స్వీడన్లోని ఉమేయాలో ఘోర ప్రమాదానికి గురైంది. -
నాటకీయంగా రద్దీ రోడ్డుపై కూలిన విమానం
-
నాటకీయంగా రద్దీ రోడ్డుపై కూలిన విమానం
అమెరికాలో ఓ చిన్న విమానం నాటకీయరీతిలో నడిరోడ్డుపై కూలిపోయింది. వాషింగ్టన్ లోని ముకిల్టియోలో మంగళవారం ఓ చిన్న విమానం రద్దీగా ఉన్న నడిరోడ్డుపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిశాయి. అదృష్టం బాగుండి ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. విమానం ఇంజన్లో సాంకేతికలోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ సురక్షితంగా తప్పించుకున్నాడు. ఒక్కసారిగా కిందవైపుగా వచ్చిన విమానం కరెంటు వైర్లను తాకడంతో ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో విమానంలో మంటలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఈ ఘటనను ఓ వాహనదారుడు కెమెరాలో బంధించాడు. సినిమాలో భారీ గ్రాఫిక్స్ ను తలపించేరీతిలో జరిగిన ఈ వాస్తవిక ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కారును ఢీకొన్న విమానం..
కాలిఫోర్నియా: ఓ ప్రైవేట్ విమానం అనుకోకుండా ప్రమాదానికి గురైంది. విమానం కారును ఢీకొన్న ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం చోటుచేసుకుంది. కాలిఫోర్నియా పెట్రోలింగ్ అధికారి క్రిస్ పేరెంట్ తెలిపిన వివరాల ప్రకారం... ఒకే ఇంజిన్ విమానం లాంకేర్ 4 లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పైలట్ జాగ్రత్త వహించాడు. విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ల్యాండ్ అయ్యే సమయంలో రోడ్డుపై ఆగిఉన్న ఓ కారును విమానం ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ మహిళ(38) మృతిచెందింది. పైలట్ తో పాటు కారులో ఉన్న నలుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. పైలట్ మాత్రం ఈ విషయంలో తన తప్పేమీ లేదని, ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం ఓవైపు ఒరిగిపోవడం వల్ల కారును ఢీకొట్టిందని చెప్పాడు. విమానం కారును ఢీకొట్టే సమయంలో కారు డ్రైవర్ పాటలు వింటున్నాడని, శబ్ధాన్ని గ్రహించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన వల్ల రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి లాస్ వేగాస్ కు వెళ్లే దారిని కొన్ని గంటల పాటు మూసివేశారు. విమానం రోడ్డుపై ల్యాండ్ కావడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఆశ్చర్చానికి లోనయ్యారు. -
అమెరికాలో కుప్ప కూలిన విమానం