మమతా దీదీకి మరో షాక్ | Trinamool minister Manjul Krishna Thakur resigns, joins BJP in Bengal | Sakshi
Sakshi News home page

మమతా దీదీకి మరో షాక్

Published Thu, Jan 15 2015 5:51 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

మమతా దీదీకి మరో షాక్

మమతా దీదీకి మరో షాక్

కొల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మమతా కేబినెట్లోని మంజులా కృష్ణ థాకూర్ తన మంత్రి పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. అనంతరం థాకూర్ బీజేపీలో చేరారు. అనంతరం విలేకర్ల సమావేశంలో థాకూర్ విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్రంలో తృణమూల్ పాలన అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు. పార్టీలో మంచి వారికి చోటు లేదని థాకూర్ విమర్శించారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. శారదా స్కామ్లో ఆమె కేబినెట్లోని రవాణాశాఖ మంత్రి మదన్ మిత్ర జైలుకు వెళ్లారు. అలాగే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ రాయ్కు సీబీఐ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. వరుస ఎదురు దెబ్బలతో మమత బెనర్జీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.   
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement