Manjul Krishna Thakur
-
దీదీకి మరో ఎదురుదెబ్బ
కోల్‌కతా: పార్టీ ఎంపీలు శారదా స్కామ్ కేసులో చిక్కుకొని ఇప్పటికే కష్టాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ కేబినెట్లో శరణార్థుల సహాయ, పునరావాస శాఖ మంత్రిగా పనిచేస్తున్న మంజుల్ కృష్ణ ఠాకూర్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కుమారుడు సుబ్రతతో సహా గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రాహుల్ సిన్హా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంజుల్ విలేకర్లతో మాట్లాడుతూ ‘ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. పార్టీలోనూ విచిత్ర పోకడలున్నాయి. నా వర్గానికి(మతువా సామాజికవర్గం) ప్రయోజనం చేకూరే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం నన్ను అడ్డుకుంటోంది. 2011 ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు’ అని ఆరోపించారు. ఫిబ్రవరి 13న బంగ్వానా ఉపఎన్నిక జరుగుతుండగా మంజుల్ వెళ్లిపోవడం తృణమూల్‌కు ఇబ్బందిగా మారింది. ఆయన సోదరుడు, టీఎంసీ ఎంపీ కపిల్ కృష్ణ ఠాకూర్ గతేడాది అక్టోబర్ 13న చనిపోవడంతో దీనికి ఉపఎన్నిక జరుగుతోంది. అయితే తన సోదరుడు సహజంగా మరణించలేదని, ఏదో కుట్ర జరిగిందని ఆరోపిస్తూ, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని మంజుల్ కృష్ణ డిమాండ్ చేశారు. -
'నా సోదరుడి మృతి వెనక కుట్ర దాగి ఉంది'
కొల్కతా : నా సోదరుడి ఎంపీ కపిల్ కృష్ణ ఠాకూర్ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని తాజాగా టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మంజుల్ కృష్ణ ఠాకూర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కొల్కతాలో విలేకర్ల సమావేశంలో మంజుల్ మాట్లాడుతూ... కపిల్‌ది సహజ మరణం కాదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆయన మృతి వెనకు కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సీబీఐ విచారణతో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కపిల్ కృష్ణ ఠాకూర్ 24 ఉత్తర పరిగణల జిల్లాలోని బంగన్ లోక్‌సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే గతేడాది అక్టోబర్ స్వల్ప అస్వస్థతతో ఆయన మరణించిన విషయం విదితమే. దాంతో బంగన్ లోక్ సభ స్థానానికి ఫిబ్రవరి 13 ఉప ఎన్నిక జరగనుంది. మమతా బెనర్జీ కేబినెట్లో మంజుల్ కృష్ణ ఠాకూర్ శరణార్థులు, పునరావాస, సహాయ చర్యల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన గురువారం మంత్రి పదవితోపాటు టీఎంసీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం కమలం తీర్థం పుచ్చుకున్నారు. దాంతో మమతా దీదీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు శారదా స్కామ్‌లో చిక్కుకుని పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
మమతా దీదీకి మరో షాక్
కొల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మమతా కేబినెట్లోని మంజులా కృష్ణ థాకూర్ తన మంత్రి పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. అనంతరం థాకూర్ బీజేపీలో చేరారు. అనంతరం విలేకర్ల సమావేశంలో థాకూర్ విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్రంలో తృణమూల్ పాలన అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు. పార్టీలో మంచి వారికి చోటు లేదని థాకూర్ విమర్శించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. శారదా స్కామ్‌లో ఆమె కేబినెట్లోని రవాణాశాఖ మంత్రి మదన్ మిత్ర జైలుకు వెళ్లారు. అలాగే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ రాయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. వరుస ఎదురు దెబ్బలతో మమత బెనర్జీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.