ఆ ఐదు రోజుల్లో ట్రంప్ యాడ్స్ ఖర్చెంతో తెలుసా?
ఆ ఐదు రోజుల్లో ట్రంప్ యాడ్స్ ఖర్చెంతో తెలుసా?
Published Fri, Nov 4 2016 12:31 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైట్ హౌస్ ఫైట్ చాలా టైట్గా మారింది. కీలక రాష్ట్రాల్లో ఎంతటి ఖర్చులునైనా పెట్టడానికి ప్రత్యర్థులు వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ హోరాహోరిగా సాగబోయే రాష్ట్రాల్లో 25 మిలియన్ డాలర్ల(రూ.166 కోట్లకు పైగా) మొత్తంలో అడ్వర్టైజ్మెంట్ స్లాట్స్ కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ఈ మేరకు నిర్ణయాన్ని డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులకు ఈ-మెయిల్స్ ద్వారా ప్రకటించారు. ఆరు కీలక రాష్ట్రాలు ఫ్లోరిడా, ఓహియో, అయోవా, మైనే, నార్త్ కేరోలిన, నెవాడాల్లో తాము ముందజంలో ఉన్నట్టు ట్రంప్ క్యాంపెయిన్ పేర్కొంది. ఒకవేళ ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే, ఎన్నికల రోజు 266 ఎలక్టోరల్ ఓట్లు తమ ఖాతాలోనే పడతాయని ఆశాభావం వ్యక్తంచేసింది.
మరోవైపు తాజా పోల్లు కూడా జార్జియా ప్రాంతంలో హిల్లరీ, ట్రంప్ కంటే ఒక పాయింట్ వెనుకంజలో పడిపోయారని వెల్లడించాయి. మిచిగాన్లో క్లింటన్ ఆధిక్యం పడిపోతుందని తాజా రిపోర్టులు సూచిస్తున్నాయి. కొలరాడోలో ట్రంప్, హిల్లరీని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపాయి. ఫోర్లిడాలో ఇరువురు పోటాపోటీగా దూసుకుపోతున్నారని అన్ని మేజర్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. దీంతో చివరి రోజులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రచార ఖర్చులను భారీగా పెంచుతున్నారు.
Advertisement
Advertisement