12 మందికి ఉరి శిక్ష అమలు చేసిన పాక్ | Twelve hanged to death in Pakistan | Sakshi
Sakshi News home page

12 మందికి ఉరి శిక్ష అమలు చేసిన పాక్

Published Tue, Mar 17 2015 9:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

Twelve hanged to death in Pakistan

పాకిస్థాన్ దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలోని మొత్తం 12 మంది ఖైదీలను మంగళవారం ఉదయం ఉరి తీశారు. ఈ మేరకు స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది.

ఇస్లామాబాద్: పాకిస్థాన్ దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలోని మొత్తం 12 మంది ఖైదీలను మంగళవారం ఉదయం ఉరి తీశారు. ఈ మేరకు స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది.  పంజాబ్ ప్రావెన్స్ జంగ్ జిల్లా జైలులోని క్రిమినల్స్ ముబాషిర్, షరీఫ్, రియాజ్లను ఉరి తీశారు. అంతకుముందు వారు తమ తమ కుటుంబ సభ్యులను కలిశారని తెలిపింది. వీరు హత్య కేసులో జంగ్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

మహిళ హత్య కేసులో నిందితుడైన జాఫర్ ఇక్బాల్ను పంజాబ్ ప్రావెన్స్ మేయిన్వాలి జిల్లా జైలులో ఉరి తీశారు. అలాగే దోపిడి కేసులో అరెస్ట్ అయిన ఫజల్, ఫైసల్లను సింధు ప్రావెన్స్లోని కరాచీ సెంట్రల్ జైల్లో ఉరి శిక్ష అములు చేశారు. మలిక్ నదీమ్, మహమ్మద్ జావెద్లకు ఉరి వేశారు.

అలాగే చిన్నారిపై హత్యాచారం చేసిన జాఫర్ ఇక్బాల్ను ముల్తాన్ సెంట్రల్ జైల్లో ఉరి శిక్షను అమలు చేశారు. హత్య కేసులో మహమ్మద్ ఇక్బాల్ను గుర్జన్వాలా సెంట్రల్ జైల్లో ఉరి తీశారు. పౌరుడి హత్య కేసులో అరెస్ట్ అయిన మహమ్మద్ నవాజ్ను ఫైసలాబాద్ సెంట్రల్ జైల్ ఉరి తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement