నడిరోడ్డుపై ఇద్దరు యువతుల కొట్లాట
నడిరోడ్డుపై ఇద్దరు యువతుల కొట్లాట
Published Thu, Sep 1 2016 3:21 AM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
టెక్కలి రూరల్ : కొద్ది సంవత్సరాలుగా పరిచయం ఉన్న యువకుడు తమకే చెందాలని ఇద్దరు యువతులు నడిరోడ్డుపై వాదులాడుకుని, కొట్లాటకు దిగడం స్థానికులను ఆశ్చర్య పరిచింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన పలువురిని ముక్కున వేలేయించింది. వివరాల్లోకి వెళ్తే... పాత జాతీయ రహదారి వద్ద ఐస్‌క్రీమ్ పార్లర్ నిర్వహిస్తున్న ఓ యువకుడికి ఇద్దరి అమ్మాయిలతో కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. సంవత్సరాలుగా కొనసాగుతున్న వీరి పరిచయ స్నేహం ముదిరి పాకాన పడింది. యువకుడిని ఇష్టపడుతున్న ఇద్దరు యువతులు యువకుడు దుకాణం ముందే తన వాడంటే తన వాడని వాదులాడుకుంటూ ఒకరి మీద ఒకరు పరస్పర దూషణలు చేసుకుంటూ చివరకు కొట్లాడుకున్నారు.
వాదులాడుకున్న సదరు ఇద్దరు యువతులు స్థానికంగా విద్యనభ్యసిస్తున్నారు. యువకుడు తనతోటే ఉంటాడని మరొక స్త్రీతో సంబంధం ఉండకూడదని ఇరువురూ మెుండికేసి ఘర్షణ పడుతున్న వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ముగ్గురిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సైతం ఇద్దరు యువతులు తమ అభిమానిస్తున్న యువకుడిపై ప్రేమ పూర్వకంగా భౌతిక దాడికి పాల్పడడం పోలీసులను కూడా విస్మయపరిచింది. చివరకు వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు నచ్చజెప్పి పంపించడంతో వివాదం సద్దుమణిగింది.
Advertisement
Advertisement