
60 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలిచిన వసుంధర రాజె
రాజస్థాన్: బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధర రాజె ఘనవిజయం సాధించారు. జలర్‌పఠాన్ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి చంద్రవత్పై 60,896 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
రాజస్థాన్లో మొత్తం 200 స్థానాలు ఉండగా, 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కడపటి ఫలితాలు తెలిసేసరికి బిజెపి 141 స్థానాలను గెలుచుకుంది. ఇంకా 20 నియోజకవర్గాలలో ఆ పార్టీ ఆధిక్యతలో ఉంది.