బాత్‌రూమ్‌లోకి తొంగి చూస్తున్నారు.. ఏం చెయ్యాలి? | viral post, Malaika Arora on Bengaluru incident | Sakshi
Sakshi News home page

బాత్‌రూమ్‌లోకి తొంగి చూస్తున్నారు.. ఏం చెయ్యాలి?

Published Mon, Jan 9 2017 10:56 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

బాత్‌రూమ్‌లోకి తొంగి చూస్తున్నారు.. ఏం చెయ్యాలి?

బాత్‌రూమ్‌లోకి తొంగి చూస్తున్నారు.. ఏం చెయ్యాలి?

పార్టీ చేసుకుందామని నా ఫ్రెండ్స్‌(అందరూ అమ్మాయిలే‌)తో కలిసి వెళ్లా. మెట్రోపాలిటన్‌ సిటీలోని ‘సివిలైజ్డ్‌ పర్సన్స్‌’ ఎంతో మంది ఉన్నారక్కడ. మమ్మల్ని చూడగానే మీదపడ్డారు.. ఒంటిని తడుముతూ, వేసుకున్న మోడ్రన్‌ దుస్తుల్ని చించేశారు. నన్ను నేను కాపాడుకోవడం నా ప్రాథమిక బాధ్యత కాబట్టి అక్కడి నుంచి దూరంగా పారిపోయా. ఈసారి బహిరంగ ప్రదేశాలు వద్దనుకుని బౌన్సర్లు ఉండే ఓ పబ్‌కు వెళ్లాం. అనూహ్యంగా.. ‘ఆ పర్సన్స్‌’ అక్కడికి కూడా వచ్చారు. మా వీపులపై, వీపు కింది భాగాలపై దెబ్బలు కొట్టారు. నన్నునేను కాపాడుకోవడానికి మళ్లీ పరుగెత్తా. మగవాళ్ల తోడుంటే భద్రంగా ఉండొచ్చని నా ఫ్రెండ్‌(అబ్బాయి)ని వెంటబెట్టుకుని సినిమాకి వెళ్లా. బస్సులో తిరిగి వస్తుండగా ‘వాళ్లు’ మళ్లీ కనిపించారు. ఈసారి పదునైన ఇనుప చువ్వలను నాలోపలికి దించారు!

కొద్దిగా బుద్ది తెచ్చుకుని, ఒళ్లు కనిపించకుండా డీసెంట్‌గా సల్వార్‌ కమీజ్‌లో కాలేజీకి వెళ్లానా.. వాళ్లు అక్కడికీ తగలబడ్డారు! నన్ను చుట్టుముట్టి ఒంటిని తడిమారు. నా సేఫ్టీకి నేనే రెస్పాన్సిబులిటీ కాబట్టి ఇంటికి పారిపోయా. ఎట్టిపరిస్థితుల్లోనూ బయటికి వెళ్లకూడదని డిసైడై ఇంట్లోనే ఉండిపోయా. ఈ సారి వాళ్లు మా బంధువుల రూపంలో మీదపడ్డారు. బెడ్‌మీద పడేసి రకరకాలుగా హింసించారు. ఇంత జరిగినా నన్ను.. నేను తప్ప ఇంకెవ్వరూ కాపాడరు! చివరికి బాత్‌రూమ్‌లోకి వెళ్లినా.. సందుల్లో నుంచి ‘వాళ్లు’ తొంగిచూస్తున్నారు. ఎం చెయ్యాలి? నా సేఫ్టీ నాకు ముఖ్యం కాబట్టి స్నానం చెయ్యడం మానేశా..! ఆ రకంగా నన్ను ఎక్కడ ఉంచాలని వాళ్లు అనుకుంన్నారో, నేను అక్కడే ఉండిపోయా. తిరిగి కోలుకోలేని విధంగా నా స్ఫూర్తిని దెబ్బతీశారు. వాళ్ల దయతో నేనింకా బాత్‌రూమ్‌లోనే ఉండిపోయా..

నేనెవరో మీకు తెలుసు కదా? బాత్‌రూమ్‌ నుంచి బయటికి వస్తే.. దేశం కోసం మెడల్స్‌ సాధించగల భారతీయ అమ్మాయిని. మగవాళ్లతో సమానంగా సైన్యంలో చేరగల ధీరని. అంతరీక్షంలోకి వెళ్లగల వ్యోమగామిని. టాప్‌మోస్ట్‌ కంపెనీలకు సీఈవో కాగల సమర్థురాలిని. కానీ నాకు నా సేఫ్టీ ముఖ్యం. నా అనుమానం ఏంటంటే.. అమ్మాయిలు మోడ్రన్‌(పొట్టి) బట్టలు వేసుకోవడం పాశ్చాత్య సంస్కృతి అయితే, వాళ్లపై అబ్బాయిలు లైంగికదాడులు చేయడం భారతీయ సంస్కృతా?

ఇది.. బాలీవుడ్‌ నటి మలైకా అరోరా ఖాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో చేసిన పోస్ట్‌. బెంగళూరు ఘటన నేపథ్యంలో దర్శన్‌ మోద్కర్‌ అనే ఫేస్‌బుక్‌ యూజర్‌ వెల్లడించిన అభిప్రాయాన్ని మలైకా షేర్‌చేశారు. 29వేల లైక్స్‌తో వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌లో.. 2009 మంగళూరు పబ్‌పై శ్రీరాంసేన దాడి, 2011 ఢిల్లీ నిర్భయ ఘటనలను సైతం ఉటంకించారు. ఈ ఘటనపై ఆమిర్‌ఖాన్‌, ఫర్హాన్‌ అఖ్తర్‌, అక్షయ్‌కుమార్‌, షారూఖ్‌ఖాన్‌ లాంటి బాలీవుడ్‌ ప్రముఖులు కూడా సంగతి తెలిసిందే.
వెంటాడి.. దుస్తులను చించి వేధించారు

నిండా దుస్తులు కప్పుకొన్నా వదల్లేదు

ఆ నీచులను వదిలిపెట్టే సమస్యే లేదు: సీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement