విశాఖ మెట్రో అంచనా వ్యయం రూ. 10,617 కోట్లు | Visakhapatnam Metro estimated cost of Rs . 10.617 crore | Sakshi
Sakshi News home page

విశాఖ మెట్రో అంచనా వ్యయం రూ. 10,617 కోట్లు

Published Wed, Aug 3 2016 7:56 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

Visakhapatnam Metro estimated cost of Rs . 10.617 crore

విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో కారిడార్లను త్వరితగతిన నిర్మిస్తామని కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్ జిత్ సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులో మూడు కారిడార్లు ఉన్నాయని, మొత్తం 42 కి.మీ. మేర నిర్మించే ఈ ప్రాజెక్టుకు రూ. 10,617 కోట్లు అంచనా వ్యయంగా ఉందని తెలిపారు. అలాగే విజయవాడ మెట్రో ప్రాజెక్టులో రెండు కారిడార్లు ఉన్నాయని, 26 కి.మీ. పొడవులో నిర్మించే ఈ ప్రాజెక్టుకు రూ. 5,815 కోట్ల మేర ఖర్చు కానుందని వివరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement