ఒకే కాన్పులో 10 మంది పిల్లలు | Woman in Madhya Pradesh delivers 10 babies | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో 10 మంది పిల్లలు

Published Tue, Dec 17 2013 11:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

Woman in Madhya Pradesh delivers 10 babies

ఓ కాన్పులో ఒకరు పుట్టడం సహజం, అలాగే  ఒకే కాన్పులో ఇద్దరు పిల్లులు పుట్టడం మనం తరచుగా అటు వార్తాల్లో ఇటు మన చుట్టు పక్కల చూస్తుంటాం. అయితే కాన్పులో 10 మంది శిశువులు జన్మించడం ఎక్కడ చూసిన దఖాల లేదు. అయితే కాన్పులో 10 మంది చిన్నారులు పుట్టిన సంఘటన సోమవారం మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. సాత్నా జిల్లాలోని కోటి గ్రామానికి చెందిన అంజు కుష్వా అనే మహిళకు తీవ్ర నొప్పులు వచ్చాయి.

 

దీంతో ఆమె భర్త అంజును రేవా జిల్లాలోని సంజయ్ గాంధీ మెమొరియల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆమె ఒకే కాన్పులో తొమ్మిది మంది శిశువులకు జన్మనిచ్చింది. అయితే అంజు మళ్లీ నెప్పులు పడుతుండటంతో వైద్యులు మరల పరీక్షలు నిర్వహించగా మరో శిశువు కుడుపుతో ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు.

 

దీంతో ఆంజు ఆ శిశువును కూడా ప్రసవించింది. అయితే 10 మంది శిశువులు మరణించారని సంజయ్ గాంధీ మెమొరియల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.  హైపర్ స్టిమ్యూలేషన్ సిండ్రోమ్ వల్ల గర్భం దాల్చిన మహిళ కడుపులో అత్యధికంగా పిండాలు రూపుదిద్దుకుంటాయని వైద్యులు తెలిపారు. అయితే ఆంజు ఆరోగ్యంగానే ఉందని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement