Satna district
-
ఒంటి నిండా పంటి గాట్లతో రకప్తు మడుగులో..
క్రైమ్: మానవ మృగాల అకృత్యాలు రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. వావివరుసలు, వయసు తారతమ్యాలు లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. సామూహిక అత్యాచారానికి గురై.. అత్యంత దీనస్థితిలో ఓ మైనర్ బాలిక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సాత్నా జిల్లా మైహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగు చూసింది. అర్కండికి చెందిన 11 ఏళ్ల బాలిక బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని.. బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. అయితే శుక్రవారం ఉదయం మైహర్ శివారులోని అడవుల్లో శారదా దేవి ఆలయం సమీపంలో రక్తపు మడుగులో బాలిక కనిపించింది. నగ్నంగా పడి ఉన్న బాలికను గమనించిన కొందరు భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను మైహర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందని.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఒంటి నిండా పంటి గాయాలు ఉన్నాయని.. పదునైన ఆయుధాలతో ఆమె అంతర్గత అవయవాలనూ గాయపరిచారని వైద్యులు నివేదిక ఇచ్చారు. బాలిక పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటన స్థానికుల్లో ఆగ్రవేశాలను రగిల్చింది. ఆస్పత్రికి చేరుకుని ‘‘న్యాయం చేయాలనే’’ నినాదాలతో హోరెత్తించారు వాళ్లు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. వాళ్లను శాంతపరిచారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మైహర్ మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్ ఘటన రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్.. బీజేపీ సర్కార్ మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో విఫలమైందని విమర్శించగా.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అత్యున్నత స్థాయి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. -
‘ఉచితాల’ నుంచి దేశానికి విముక్తి కావాలి
సాత్నా: దేశంలో సామాజిక–ఆర్థిక మార్పులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ముఖ్యసాధనంగా మారిందని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ పథకం కింద నిర్మించిన ఇళ్లల్లో శనివారం గృహప్రవేశాలను ఆయన రిమోట్ నొక్కి ప్రారంభించారు. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో నినాదాలు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. పన్ను సొమ్మంతా ఉచితాల కింద పంచేస్తే ట్యాక్స్‌పేయర్లకు బాధ కలుగుతుందని పేర్కొన్నారు. ఎంతోమంది పన్ను చెల్లింపుదార్లు తనకు లేఖలు రాశారని, ఉచితాలకు అడ్డుకట్ట పడాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఉచిత పథకాల నుంచి దేశం విముక్తి పొందాలని సమాజంలోని ఒక పెద్ద వర్గం ఆశిస్తుండడం సంతోషం కలిగిస్తోందన్నారు. పీఎంఏవై కింద దేశంలో గత ఎనిమిదేళ్లలో పేదలకు అన్ని వసతులతో కూడిన 3.5 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చామని వివరించారు. పేదలకు ఇచ్చిన ఇళ్లు వారికి కోటల్లాంటివని, వాటిలోకి పేదరికాన్ని అడుగు పెట్టనివ్వకూడదని ప్రధాని పిలుపునిచ్చారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. సత్నా జిల్లా వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన ట్రక్కు కారును ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. (జగిత్యాల జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం) -
ఇద్దరు మహిళల ఘర్షణ; వీడియో వైరల్
లక్నో : మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో బుధవరం ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు పరస్పరం కొట్టుకున్నారు. వీరిలో ఒకరు లాయర్ కాగా మరోకరు స్థానిక మహిళగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి ఘర్షణ మధ్యలో మరో వ్యక్తి(లాయర్) కల్పించుకొని ఇద్దరు మహిళలను చితకబాదాడు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గొడవలకు కారణం ఏంటనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే పాత కక్షల కారణంగానే ఈ ఘర్షణ జరగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. -
మృతుడిపై పోలీసు కేసు
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని సాత్న జిల్లాలో ఆదివారం ఇద్దరు ముస్లిం యువకులపై గోరక్షకులు చేసిన దాడిలో ఓ యువకుడు మరణించగా మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు రెండు కేసులు దాఖలు చేశారు. మరణించిన వ్యక్తి, ఆయన స్నేహితుడిపై గోహత్య కేసును.. వారిపై దాడిచేసిన వారిపై హత్యా, హత్యాయత్నం కేసులను దాఖలు చేశారు. ఈ సంఘటనలో మరణించిన వ్యక్తి పోలీసులు చెప్పినట్లు రియాజ్ ఖాన్ కాదు. షిరాజ్ ఖాన్ అతను. సాత్న జిల్లాలోని మైహార్ పట్టణంలో షిరాజ్ ఖాన్ కుట్టుమిషన్ నడుపుకుంటూ జీవిస్తుండగా, ఆయన స్నేహితుడు షకీల్ (38) సైకిల్ షాపు నడుపుకుంటున్నారు. షిరాన్ ఖాన్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఇద్దరు మిత్రులు సమీపంలోని పొరుగూరికి వెళ్లి ఆదివారం ఉదయం పట్టణానికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో కొంత మంది గోరక్షకులు దాడిచేసి ఇనుప రాడ్లతో, చెక్క ఫలకలతో చితక్కొట్టారు. షిరాజ్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. షకీల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. షకీల్ కోలుకున్నాక ఆయన్ని అరెస్ట్ చేస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సంఘటన జరిగిన చోట రెండు కిలోల ఆవు మాంసం దొరికిందని పోలీసులు చెబుతున్నారు. షిరాజ్ ఖాన్‌కు పొరుగూరులో ఒకరు డబ్బివ్వాల్సి ఉండగా, ఆ డబ్బుల కోసం స్నేహితుడిని తీసుకొని వస్తుండగా అన్యాయంగా వారిపై దుండగులు దాడి చేశారని షిరాజ్ ఖాన్ భార్య ఆరోపిస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలు జరపకుండా ఆవు మాంసం కలిగి ఉన్నారని ఎలా ఆరోపిస్తున్నారని షిరాజ్ ఖాన్ తమ్ముడు ఇమ్రాన్ ఖాన్ వాదిస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. -
గో హంతకులనే అనుమానంతో దాడి
భోపాల్ : గో హంతకులనే అనుమానంతో గ్రామస్తులు జరిపిన దాడిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా అమ్‌గారాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పూరానా బస్తీకి చెందిన రియాజ్, షకీల్‌లు కైమూర్ నుంచి తిరిగివస్తుండగా.. వారిని గో హంతకులుగా అనుమానించిన అమ్‌గారా గ్రామ యువకులు గ్రామంలోని ఇతరులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామంలోని వారంతా.. వారిపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు సాత్నా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రియాజ్ చికిత్స పొందుతూ మరణించాడు. టైలర్‌గా పనిచేస్తున్న రియాజ్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. దీంతో సాత్నా జిల్లాలో ఉద్రిక్త పరిస్థతులు ఏర్పడ్డాయి. ఈ ఘటనపై షకీల్ పోలీసులను ఆశ్రయించాడు. తాము గో హంతకులం కాదని ఆయన వారికి తెలిపారు. తప్పుగా అర్థం చేసుకున్న అమ్‌గారా గ్రామ ప్రజలు తమపై దాడికి దిగినట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కూడా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. రియాజ్, షకీల్‌పై తాము ఎలాంటి దాడి చేయలేదని.. ఆవులను ఎత్తుకెళ్లడానికి వచ్చిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు కిందపడి గాయపడట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఎద్దు మాంసం అమ్ముతున్నారని..
భోపాల్ : ఎద్దు మాంసం అమ్ముతున్నారనే నెపంతో ఇద్దరిని తీవ్రంగా కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ సాత్నా జిల్లాలోని అమ్‌ఘర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి బాదేరా పోలీసు స్టేషన్ పరిధిలో రియాజ్(45), షకీల్ (33)లు తమ ఊరికి తిరిగి వెళుతుండగా మార్గం మధ్యలో కొంతమంది గ్రామస్తులు వీరికి ఎదురయ్యారు. రియాజ్, షకీల్ వద్ద ఎద్దు మాంసం ఉన్నట్లు గుర్తించిన గ్రామస్తులు వారు మాంసం అమ్ముతున్నారన్న అనుమానంతో తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే రియాజ్ మృతి చెందాడు. తీవ్రగాయాలపాలై ప్రాణాలతో పోరాడుతున్న షకీల్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరిలించారు. సంఘటనా స్థలంలో ఒక ఎద్దు కళేబరంతో పాటు మూటకట్టి ఉంచిన మాంసాన్ని పోలీసులు గుర్తించారు. కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఒకే కాన్పులో 10 మంది పిల్లలు
ఓ కాన్పులో ఒకరు పుట్టడం సహజం, అలాగే ఒకే కాన్పులో ఇద్దరు పిల్లులు పుట్టడం మనం తరచుగా అటు వార్తాల్లో ఇటు మన చుట్టు పక్కల చూస్తుంటాం. అయితే కాన్పులో 10 మంది శిశువులు జన్మించడం ఎక్కడ చూసిన దఖాల లేదు. అయితే కాన్పులో 10 మంది చిన్నారులు పుట్టిన సంఘటన సోమవారం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సాత్నా జిల్లాలోని కోటి గ్రామానికి చెందిన అంజు కుష్వా అనే మహిళకు తీవ్ర నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె భర్త అంజును రేవా జిల్లాలోని సంజయ్ గాంధీ మెమొరియల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆమె ఒకే కాన్పులో తొమ్మిది మంది శిశువులకు జన్మనిచ్చింది. అయితే అంజు మళ్లీ నెప్పులు పడుతుండటంతో వైద్యులు మరల పరీక్షలు నిర్వహించగా మరో శిశువు కుడుపుతో ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. దీంతో ఆంజు ఆ శిశువును కూడా ప్రసవించింది. అయితే 10 మంది శిశువులు మరణించారని సంజయ్ గాంధీ మెమొరియల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. హైపర్ స్టిమ్యూలేషన్ సిండ్రోమ్ వల్ల గర్భం దాల్చిన మహిళ కడుపులో అత్యధికంగా పిండాలు రూపుదిద్దుకుంటాయని వైద్యులు తెలిపారు. అయితే ఆంజు ఆరోగ్యంగానే ఉందని తెలిపారు.